Putin: వెస్ట్రన్ దేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫైర్ అయ్యారు. భారత్, రష్యా బంధాన్ని పశ్చిమ దేశాలు విడదీయలేవని ఆయన అన్నారు. భారతదేశం తన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని, దీనివల్ల పాశ్చాత్య దేశాల ప్రభావం పడదని ఆయన పేర్కొన్నారు. సోచి నగరంలో రష్యాన్ బ్లాక్ సీ రిసార్టులో జరిగి ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విశాఖ ఉక్కు అప్పులను నష్టాలుగా చూపించి కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం అన్యాయం అంటూ సీతారాం ఏచూరి మండిపడ్డారు. వ్యవస్థను మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెడుతోంది అని ఆయన విమర్శలు గుప్పించారు.
PM Modi: కాంగ్రెస్ టార్గెట్గా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మోడీ పర్యటించారు. ‘పేపర్ లీక్ మాఫియా’ రాజస్థాన్ లోని లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జోధ్పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ప్రతీ అవినీతి తమ వద్ద ఉందని, దానిని బయటకు తీసుకురావాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని మోడీ అన్నారు.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆయన "చాలా తెలివైన వ్యక్తి" అని, మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెంతుతోందని ఆయన పొగిడారు. ఆర్థిక భద్రత, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాటంలో రష్యా, భారత్ మధ్య మరింత సహకారం ఉంటుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు కీలక ఆప్ నేతలు జైళ్లలో ఉన్నారు. సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాల తర్వాత ఇప్పుడు సంజయ్ సింగ్ జైలులోకి వెళ్లారు.