తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నరేంద్ర మోడీ. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ఆలయ మహాద్వారం వద్ద ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 10.25 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటలకు హకీంపేట్‌కు ఆయన చేరుకోనున్నారు.
Koti Deepotsavam 2023 Day 14: కార్తిక మాసంలో ప్రతీ ఏడాది ఎన్టీవీ, భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం చివరి రోజుకు చేరింది.. నవంబర్ 14వ తేదీ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తోన్న దీప యజ్ఞం కోటి దీపోత్సవం ఇవాళ్టితో ముగియనుంది.. దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామూర్తులను వేదికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహించారు.. ప్రసిద్ధ పండితుల ప్రవచనాలు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణ, అతిరథ మహారథులు అతిథులుగా వచ్చేశారు.. ఇక, ఈ ఏటి ఉత్సవం…
రేపు సాయంత్రం హైదరాబాద్‌లో ప్రధాని మోడీ రోడ్ షోలో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు సాగనున్న మోడీ రోడ్ షో కొనసాగనుంది. రేపు ఉదయం మహబూబాబాద్ బహిరంగ సభ, మధ్యాహ్నం కరీంనగర్ బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి కాంగ్రెస్ రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓవైసీ, ప్రధాని నరేంద్రమోడీకి స్నేహితుడని వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఓవైసీ స్పందించారు. రాహుల్ గాంధీ జీవితంలో రెండు ప్రేమలు ఉన్నాయని, ఒకటి ఇటలీ అయితే మరొకరు ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు.
26/11 ముంబై దాడులు భారత దేశం ఎప్పటికీ మరిచిపోలేని ఉగ్రదాడి. పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్రం మార్గాన ముంబై మహానగరంలోకి వచ్చి మారణహోమాన్ని సృష్టించారు. ఈ ఘటనకు నేటితో 15 ఏళ్లు నిండాయి. అయితే ఆ నెత్తుటి గుర్తులు ఇప్పటికీ దేశ ప్రజలను బాధిస్తున్నాయి. నరేంద్రమోడీ ఈ రోజు తన 107వ ఎడిషన్ మన్ కీ బాత్‌లో ముంబై ఉగ్రదాడిని ‘ అత్యంత భయంకరమైన ఉగ్రదాడి’ గా పేర్కొన్నారు. ‘‘ ఈ రోజు నవంబర్ 26, ఈ రోజును…
PM Modi: కొన్ని పెద్ద కుటుంబాలు డెస్టినేషన్ వెడ్డింగ్ పేరులో విదేశాల్లో వివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. అయితే దీనిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొన్ని కుటుంబాలు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్న తీరు తనను కలవరపరుస్తోందని, దేశానికి చెందిన ధనం వేరే దేశానికి చేరకుండా భారత గడ్డపై ఇలాంటి వేడుకలను నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం కోరారు. పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేసేటప్పుడు, ప్రజలు…
మెదక్ జిల్లా తూప్రాన్ లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటి సారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుగులో మాట్లాడారు. దుబ్బాక, హుజురాబాద్ లో ట్రైలర్ చూశారు...ఇక సినిమా చూస్తారని ప్రధాని మోదీ తెలిపారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్నారు. న
PM Modi Mann Ki Baat: మన్ కీ బాత్ 107వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ ఎపిసోడ్లో ప్రధాని మోడీ దేశానికి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.