రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్రం శుభవార్త అందించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగిస్తూ కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్ అందించేందుకు కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 81 కోట్ల మంది పేద ప్రజలు లబ్ధీ పొందుతన్నారు.…
PM Modi: ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ విజయవంతమైంది. ఉత్తరకాశీలో నవంబర్ 12న సిల్క్యారా టన్నెల్ కూలిపోవడంతో 41 మంది అందులోనే చిక్కుకుపోయారు. గత 17 రోజులుగా అందులో చిక్కుకుపోయిన కార్మికులు సురక్షితంగా ఉండాలని దేశం మొత్తం ప్రార్థించింది. తాజాగా ఈ రోజు 41 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ పై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు పెట్టారు.
Rozgar Mela: ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరబోతున్న 51,000 మందికి ‘రోజ్గార్ యోజన’ కింద జాబ్ లెటర్స్ ఇవ్వబోతున్నారు. నవంబర్ 30న ప్రధాని చేతుల మీదుగా వారిందకిరి ఉద్యోగ నియామక పత్రాలను అందుకోనున్నారు. కొత్తగా విధుల్లో చేరుతున్న ఉద్యోగులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారని మంగళవారం పీఎం కార్యాలయం తెలిపింది. 'రోజ్గార్ మేళా'లో భాగంగా దేశవ్యాప్తంగా 37 ప్రదేశాలలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నియామకాలు జరుగుతున్నాయని…
Manda Krishna Madiga : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో అగ్ర నేతలంతా ఆఖరి అస్త్రాలను ఓటర్ల పై ప్రయోగిస్తున్నారు.
రేపు (మంగళవారం) ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశం జరుగుతుందని వర్గాలు తెలిపాయి. సాయంత్రం 6 గంటలకు జరగనున్న.. మంత్రి మండలి సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీజేపీ కార్యకర్తలు, జనాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్ షో జరుగుతున్నంత సేపు.. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. 45 నిమిషాలు పాటు ఈ రోడ్ షో సాగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు 2.5…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నరేంద్ర మోడీ. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ఆలయ మహాద్వారం వద్ద ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 10.25 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటలకు హకీంపేట్కు ఆయన చేరుకోనున్నారు.
Koti Deepotsavam 2023 Day 14: కార్తిక మాసంలో ప్రతీ ఏడాది ఎన్టీవీ, భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం చివరి రోజుకు చేరింది.. నవంబర్ 14వ తేదీ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తోన్న దీప యజ్ఞం కోటి దీపోత్సవం ఇవాళ్టితో ముగియనుంది.. దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామూర్తులను వేదికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహించారు.. ప్రసిద్ధ పండితుల ప్రవచనాలు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణ, అతిరథ మహారథులు అతిథులుగా వచ్చేశారు.. ఇక, ఈ ఏటి ఉత్సవం…