#Melodi: ఈ రోజు సోషల్ మీడియాలో #Melodi ట్రెండ్ అవుతోంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని బీచ్ లో నడుస్తున్న ఫోటోను ప్రజలు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారు. ఈ ఫోటోలో మెలోనీ బీచ్‌ను శుభ్రం చేస్తూ కనిపించింది.. నేను హఠాత్తుగా సముద్ర తీరాన్ని ప్రేమించడం మొదలుపెట్టాను అనే ఈ శీర్షికతో ఈ పిక్ వైరల్ అవుతుంది. ఈ ఫోటోపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: V.Hanumantharao: సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే.. వీహెచ్ ఏమన్నారంటే.. !
అయితే, భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం నిన్న ( గురువారం ) లక్షద్వీప్ లోని బీచ్ లో కాసేపు మార్నింగ్ చేసిన తర్వాత బుక్ చదువు ఉన్న ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ ప్రశాంత వాతావరణం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. తాజాగా, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని బీచ్ లో ఉన్న ఫోటో నెట్టింట ప్రత్యక్షం కావడంతో దీన్ని నెటిజన్స్ #Melodi తెగ వైరల్ చేస్తున్నారు.
Read Also: Tillu square : టిల్లు ను వెంటాడుతున్న వాయిదా కష్టాలు..
ఇక, అంతకు ముందు దుబాయ్ వేదికగా జరిగిన COP 2023 సదస్సులోనూ ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ పీఎం జార్జియా మెలోని సెల్పీ తీసుకున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. ఆ ఫోటో ఇటలీ ప్రధాని మెలోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. నా ప్రియమైన స్నేహితుడితో అంటూ క్యాప్షన్ ఇచ్చింది.. దీంతో ఈ పిక్ నెట్టింట ట్రెండింగ్ లోకి వచ్చింది.