కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌గాంధీ మేధావి అని.. యూపీఏ-2లో మన్మోహన్ సింగ్.. పదని పదవిని ఆఫర్ చేస్తే రాహుల్ గాంధీ కొన్ని సెకన్లలోనే తిరస్కరించారని గుర్తు చేశారు.
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. 2022, జులై 16న ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్ ఎన్నికయ్యారు.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమరం మొదలైపోయింది. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి-మార్చి మధ్యలో బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభలో విపక్షాలకు కూడా మాట్లాడటానికి అవకాశం ఉండాలి అని డిమాండ్ చేశారు. సభలో నేను రెండు విషయాలు చెప్పాలనుకున్నాను.. రక్షణ మంత్రి, ఇతరులు మాట్లాడతారు.. కానీ, విపక్ష నేతగా నాకు అవకాశం ఇవ్వలేదు అని మండిపడ్డారు.
PM Modi: ఢిల్లీలోని పార్లమెంట్ ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈసారి పడిన వర్షాలు వ్యవసాయానికి ఊతమిస్తాయి. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. యాక్సియం-4 మిషన్‌పై మోడీ ప్రశంసలు గుప్పించారు. అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించామని.. ఐఎస్ఎస్ లో మువ్వన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలకు గర్వకారణం అని అన్నారు. భారత సైనిక పాటవాలను ప్రపంచ…
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. రేపటి (జూలై 21) నుంచి వచ్చే నెల ఆగస్టు 21 వరకు మొత్తం 21 రోజుల పాటు “పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు” సాగనున్నాయి. ఆగస్టు 12 నుంచి 18 వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలకు శెలవు. మొత్తం ఏడు పెండింగ్ బిల్లుల తో పాటు, కొత్తగా మరో ఎనిమిది బిల్లులను ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. కొత్తగా గౌహతిలో ఐఐఎమ్ ఉన్నత విద్యాసంస్థను నెలకొల్పేందుకు…
Tejashwi Yadav: ఎన్నికల ముందు బీహార్ రాష్ట్రంలో పెరుగుతున్న హింసపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పరాస్ ఆస్పత్రి కాల్పులు, వ్యాపారవేత్త హత్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న హత్యలపై బీజేపీ-జేడీయూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిస్సహాయంగా ఉందని అన్నారు. ‘‘బీహార్‌ని బీజేపీ తాలిబాన్‌గా మార్చింది’’ అని ఆరోపించారు. Read Also: Liquor Scam Case: క్లైమాక్స్‌కి చేరిన లిక్కర్ స్కాం…
ప్రధాని మోడీ మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. జూలై 23-26 తేదీల్లో యూకే, మాల్దీవుల్లో మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ తెలిపింది. ఇటీవలే ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చారు. కొద్ది రోజుల గ్యాప్‌లనే మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు.
2036 ఒలింపిక్స్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి వెల్లడించారు. ప్రపంచ పోలీస్–ఫైర్ క్రీడల్లో పతకాలతో సత్తా చాటిన భారత బృంద సభ్యులను అమిత్ షా ఘనంగా సన్మానించారు.