PM Modi: గుజరాత్లోని హన్సల్పూర్లో మారుతి సుజుకి కొత్త తయారీ ప్లాంట్ ను ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కైచీ ఓనో, సుజుకి మోటార్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ప్రారంభం అయ్యింది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా భారత్ గ్లోబల్ ఆటోమొబైల్ రంగంలో మరింత బలమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోనుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం కారణంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా…
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే ఈలోపే బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. బీహార్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే కొత్త అధ్యక్షుడిని నియమించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి.
భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు నడిచాయి. భారత్ మంచి స్నేహితుడు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ సుంకాలు కారణంగా ఆ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ప్రధానమంత్రి కార్యాలయం మంగళవారం అత్యున్నత సమావేశం నిర్వహిస్తోంది. ప్రధాని మోడీకి ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి నేతృత్వం వహించనున్నారు. బుధవారం నుంచి ట్రంప్ విధించిన 50 శాతం సుంకం అమల్లోకి రానుంది.
ఎన్డీఏ తరఫున ఉప రాష్ట్రపతి బీజేపీ సీపీ రాధకృష్ణన్ ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా బరిలో నిలవటంతో మద్దతుగా నిలిచింది వైసీపీ.. మొత్తంమీద మరోసారి తమకు బీజేపీతో స్నేహ సంభందాన్ని గుర్తుకు తెచ్చినట్లేనని ఆ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. సోమవారం నాడు ట్రంప్-జెలెన్స్కీ సమావేశానికి కొన్ని గంటల ముందు పుతిన్ ఫోన్ కాల్ చేశారు. ఈ సందర్భంగా ఆగస్టు 15న అలాస్కా వేదికగా ట్రంప్తో జరిగిన సంభాషణను మోడీతో పంచుకున్నారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్ పేరును ఎన్డీఏ కూటమి ప్రకటించేసింది. అనూహ్యంగా ఊహాగానాల్లో వినిపించని పేరు తెరపైకి వచ్చి ఆశ్చర్యపరిచింది. అయితే రాధాకృష్ణన్ ఎంపిక వెనుక బీజేపీకి చాలా వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది.
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రతి పౌరుడి భద్రతను నిర్ధారించడానికి, భవిష్యత్తులో సాంకేతికత ఆధారిత సవాళ్లను ఎదుర్కోవడానికి 2035 నాటికి ‘సుదర్శన్ చక్ర’ అనే జాతీయ భద్రతా కవచాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ మిషన్ వెనుక ఉన్న ప్రేరణను ప్రస్తావిస్తూ, ఇది శ్రీకృష్ణుని సుదర్శన చక్రం నుంచి ప్రేరణ పొందిందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ మిషన్కు సంబంధించిన మొత్తం పరిశోధన, అభివృద్ధి,…
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటలో ప్రసంగించారు. ఈ సందర్భంగా యువత ఉపాధి, సాధికారత గురించి ఆయన అనేక విషయాలు చెప్పారు. దీనితో పాటు, ప్రధాని మోడీ కోట్లాది మంది యువతకు ఒక పెద్ద బహుమతిని ఇచ్చారు. నేటి నుంచే యువతకు ఉపాధి పథకం ప్రధాన మంత్రి వికాస్ భారత్ రోజ్గార్ యోజన ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పథకం కింద, యువతకు 15 వేల రూపాయలు ఇవ్వనున్నారు. కానీ ఏ యువతకు ఈ…
ప్రధానమంత్రి మోడీ స్వాతంత్య్ర దినోత్సవం వేళ తీపికబురును అందించారు. ఈసారి ప్రజలకు దీపావళి డబుల్ బహుమతి లభిస్తుందని అన్నారు. దీపావళి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ(GST) భారం తగ్గిస్తున్నట్టు ఎర్రకోట ప్రసంగంలో ప్రకటించారు. జీఎస్టీ నిపణుల కమిటీ ఇచ్చిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘మేము పన్ను వ్యవస్థను సరళీకృతం చేశాము. గత ఎనిమిది సంవత్సరాలలో, మేము GST లో భారీ సంస్కరణలు చేశాము. దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించాము. మేము తదుపరి తరం GST…