ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి భయం.. అందుకే ఆయనను అరెస్ట్ చేయించారని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.
హోలీ సెలబ్రేషన్స్ కు రాజకీయ రంగు పులుముకుంది. దేశంలోని పలు ప్రాంతాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లు దర్శనమిచ్చాయి. వీటిని వినియోగిస్తూ జనం హోలీ వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే, ఈ వాటర్ గన్ల వినియోగంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది
లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత గూటికి వెళ్తున్నారు. ఇవాళ ( సోమవారం ) మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతల సమక్షంలో ఆయన పార్టీలోకి చేరబోతున్నారు.
Chandrayaan-3: గతేడాది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయింది. చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన తొలి అంతరిక్ష నౌకగా చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది.
మొత్తానికి కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది. అలాగే సీట్ల పంకాలు కూడా ఖరారయ్యాయి. మొత్తం కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో, జేడీఎస్ 3 సీట్లలో పోటీ చేయనున్నాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Moscow terror attack: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం భారత సరిహద్దు దేశం భూటాన్ వెళ్లారు. శుక్రవారం మోడీ బిజిబిజీగా గడిపారు. అక్కడ ప్రభుత్వ పెద్దలతో మోడీ సమావేశం అయి పలు కీలక అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు.