వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 400 సీట్లు ఇవ్వాలంటూ ప్రధాని మోడీ ప్రతీ సభల్లో విజ్ఞప్తి చేస్తు్న్నారు. రోడ్ షోలోనైనా, బహిరంగ సభల్లోనైనా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.
రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. వరుసగా ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ గెలుపొందారు. ఈ మేరకు ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా పుతిన్‌కు మోడీ విషెస్ చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాలే లక్ష్యంగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత కొద్దిరోజులుగా కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
ప్రధాని మోడీ జగిత్యాల పర్యటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి ఎన్నికల కార్యక్రమంలో దేశ అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాల గురించి వివరించాలని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ కి ఏ గతి పట్టిందో.. దేశంలో కూడా మోడీకి అదే గతి పడుతుందని ఆరోపించారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అకౌంట్ కూడా ఓపెన్ కాదని విమర్శించారు. కేసీఆర్ గారడీ చేసినట్టే మోడీ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని…
లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఖర్గే సొంత జిల్లా కలబురగి నుంచి ప్రారంభించినందున ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు భయపడుతున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. కలబురగితో పాటు కర్ణాటకలోని 20 లోక్‌సభ స్థానాలను పార్టీ గెలుచుకోవడం ఖాయమని అన్నారు.
బీజేపీ తన అభ్యర్థుల రెండు జాబితాలను విడుదల చేసింది. దీంతో పాటు బీజేపీ కూడా కొత్త తరం నేతల సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల 70 ఏళ్లు పైబడిన వారిని కూడా అభ్యర్థులుగా నియమించారు, అయితే చాలా చోట్ల బీజేపీ సిట్టింగ్ ఎంపీల టిక్కెట్లను రద్దు చేసింది.
చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభలో ప్రధాని ఏదైనా వాగ్దానం చేశారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం ఏం న్యాయం చేసిందంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలు ఇచ్చారు.. అంతేకానీ ప్రత్యేకంగా ఏమి ఇచ్చారంటూ ప్రశ్నించారు.