ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కోర్టుల్లో వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సతమతం అవుతున్న ఆ నేతలకు తాజాగా ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారంలో కూడా న్యాయస్థానంలో చుక్కెదురైంది. ప్రధాని మోడీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్‌కు జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి భారీ షాక్ తగలినట్టైంది.
ఇది కూడా చదవండి: Chandrababu: ప్రజలంతా ఏకమై రాజకీయాల నుంచి ఈ రౌడీలను తరిమి కొట్టాలి..
మోడీ విద్యార్హతలపై ఆప్ నేత సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ యూనివర్సిటీ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. దీంతో సంజయ్‌సింగ్‌కు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేసింది. దీంతో తనపై చర్యలు తీసుకోకుండా మెట్రోపాలిటన్ ఇచ్చిన సమన్లపై స్టే ఇవ్వాల్సిందిగా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఇక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఈ కేసులో చర్యలు తీసుకోకుండా స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. తాజాగా హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోవాలంటూ సంజయ్‌సింగ్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారించిన ధర్మాసనం.. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. సమన్లను రద్దు చేయాలని సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో సంజయ్‌సింగ్‌కు గట్టి షాక్ తగలినట్టైంది.
ఇది కూడా చదవండి: Kakarla Suresh: వ్యవసాయాన్ని పండగ చేస్తా- రైతన్నకు వెన్నుగా నిలుస్తా..!
ఈ పరువు నష్టం కేసులో సంజయ్‌సింగ్‌తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. గుజరాత్ యూనివర్సిటీ ఆప్ నేతలపై పరువు నష్టం కేసు దాఖలు చేయడానికి ముందు… సమాచార హక్కు చట్టం కింద ప్రధాని కార్యాలయం మోడీ డిగ్రీ సర్టిఫికేట్‌లను అందించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. అనంతరం కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లపై గుజరాత్ యూనివర్సిటీ పరువునష్టం దావా వేసింది. ఇక ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లకు గతేడాది ఏప్రిల్‌లో సమన్లు అందాయి. ఫిబ్రవరి 26న, వీరిద్దరికి జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును సంజయ్‌సింగ్ ఆశ్రయించారు. తాజాగా అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ కొట్టేయడంతో ఆప్‌కు భారీ షాక్ తగిలింది.
ఇది కూడా చదవండి: AP Weather: ఏపీలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం..