Chandrayaan-3: గతేడాది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయింది. చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన తొలి అంతరిక్ష నౌకగా చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది.
మొత్తానికి కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది. అలాగే సీట్ల పంకాలు కూడా ఖరారయ్యాయి. మొత్తం కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో, జేడీఎస్ 3 సీట్లలో పోటీ చేయనున్నాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Moscow terror attack: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం భారత సరిహద్దు దేశం భూటాన్ వెళ్లారు. శుక్రవారం మోడీ బిజిబిజీగా గడిపారు. అక్కడ ప్రభుత్వ పెద్దలతో మోడీ సమావేశం అయి పలు కీలక అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు.
PM Modi Bhutan Visit: ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పాటు భారత సరిహద్దు దేశం భూటాన్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇదిలా ఉంటే భూటాన్ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని నరేంద్రమోడీకి అందించింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’’ అవార్డును భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్చుక్ స్వయంగా ప్రధాని మోడీకి ప్రధానం చేశారు.
ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భూటాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్కు వెళ్లారు. ఇవాళ (శుక్రవారం) ఉదయాన్నే ప్రధాని మోడీ భూటాన్ పర్యటన కోసం ప్రత్యేక విమానంలో బయలు దేరారు.
దేశంలో గతంలో ఎన్నడూ లేని మెజారిటీని దేశ ప్రజలు నరేంద్రమోడీకి కట్టబెట్టపోతున్నారు.. దేశంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం.. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం నరేంద్రమోడీ నాయకత్వంలో నీతివంతమైన ప్రభుత్వం మళ్లీ రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు అని కిషన్ రెడ్డి అన్నారు.