Maldives: మాల్దీవులను విడిచిపెట్టిన 2వ బ్యాచ్ భారత సైనిక సిబ్బంది.. ప్రకటించిన మహ్మద్ ముయిజ్జూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక, చైనా అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల సమయంలో ‘ఇండియా ఔట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన అతను, మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బందిన పంపిస్తానని హామీ ఇచ్చాడు. దీనిపై భారత్-మాల్దీవుల మధ్య పలు చర్చలు జరిగాయి. చివరకు భారత సిబ్బంది ఆ దేశాన్ని వదులుతున్నారు. తాజాగా 2వ బ్యాచ్ భారత సిబ్బంది మాల్దీవులను వదిలిపెట్టినట్లు ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జూ ప్రకటించారు. మాల్దీవుల్లో మానవతా సాయం అందిస్తున్న భారత సిబ్బంది మే 10 వరకు పూర్తిగా దేశాన్ని వదిలివెళ్తారని చెప్పారు.
Read Also: Anti Tank Missile: యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్ డెవలప్‌మెంటల్ ట్రయల్స్‌ను పాస్ చేసిన డిఆర్డిఓ..!
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
భారత సిబ్బంది ఫస్ట్ బ్యాచ్ మార్చి 10లోగా మాల్దీవులను వదిలివెళ్లాలని గడువు పెట్టారు. ఏప్రిల్ 9న రెండో బ్యాచ్ భారత సైనికులు ఆ దేశాన్ని వదిలి వెళ్లారు. ఫిబ్రవరిలో మాల్దీవులు మరియు భారతదేశం మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, భారతదేశం నుండి కూడా శిక్షణ పొందిన పౌరులను, ఆ దేశానికి బహుమతిగా ఇచ్చిన మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారతీయ సైనిక సిబ్బందిని భర్తీ చేయడానికి న్యూఢిల్లీ అంగీకరించింది. మాల్దీవుల ప్రభుత్వం ప్రకారం.. ఆ దేశంలో 88 మంది భారతీయ సైనిక సిబ్బంది అడ్డూ, లాము కధూలో హెలికాప్టర్లను, హనిమాధూలో ఒక డోర్నియర్ విమానాన్ని ఆపరేట్ చేస్తున్నారు.
గతేడాది అధికారంలోకి వచ్చిన ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నాడు. చైనాకు అనుకూలంగా ఉంటూ, ఆ దేశంలో పర్యటించి, జిన్‌పింగ్‌తో పలు ఒప్పందాలను చేసుకున్నాడు. చైనా మరియు మాల్దీవులు ఇటీవల రక్షణ సహకార ఒప్పందం మరియు అనేక ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై సంతకం చేశాయి. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ లక్ష ద్వీప్ పర్యటన సమయంలో ఆ దేశ మంత్రులు ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మాల్దీవుల ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!