PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ‘‘పాకిస్తాన్ అణుశక్తికి బయపడే పిరికివాళ్లు’’గా అభివర్ణించారు.
PM Modi: ఈ రోజు నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. 96 ఎంపీ స్థానాల్లో 1717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోదీ బీహార్ రాజధాని పాట్నాలో మెగా రోడ్ షో నిర్వహించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి ఆదివారం ప్రధాని రోడ్ షోలో పాల్గొన్నారు.
ప్రధాని మోడీ మే 14న వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో చివరి విడతలో.. అనగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం మంగళవారం ప్రధాని నామినేషన్ వేయనున్నారు.
PM Modi: పశ్చిమ బెంగాల్లో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలపై విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీలో టీఎంసీ నాయకులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఇప్పుడు ఆ పార్టీ గుండాలు వారిని బెదిరిస్తున్నారని మోడీ ఆరోపించారు.
పేదల ఆస్తుల్ని దోచుకెళ్లే స్కాంగ్రెస్ హస్తం అంతు తేలుద్దామని ఇవాళ (ఆదివారం) బీజేపీ పార్టీ భస్మాసుర హస్తం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. దొంగే దొంగా దొంగా అంటూ అరిచినట్లు ఉంది కమలం పార్టీ తీరు చూస్తుంటే అని విమర్శలు కురిపించింది.
సంస్కృత భాష అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించిన మీరు ఒడియాకు ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించలేదు అని సీఎం నవీన్ పట్నాయక్ ప్రశ్నించారు. క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఉన్నప్పటికీ ఒడియాను మర్చిపోయారంటూ మండిపడ్డారు. ఒడిస్సీ మ్యూజిక్ కు క్లాసికల్ హోదా కోసం తాను రెండు సార్లు ప్రతిపాదనలు పంపినప్పటికి వాటిని పట్టించుకోలేదని ఆయన విమర్శలు గుప్పించారు.