మా ప్రయాణం ఎన్డీఏతోనే అని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. మేం ఎన్డీఏలో ఉన్నాం.. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నా.. ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నాం అని వెల్లడించారు.
నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోతుంది. అయితే గత ఎన్నికల కంటే తక్కువ స్థానాలు రావడంతో ఈ మంత్రివర్గ సమావేశానికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సూపర్ విక్టరీ సాధించింది.. దీంతో.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వేదికగా ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినబాట పట్టనున్నారు టీడీపీ చీఫ్.. ఇక, ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. ఇక, వరుసగా మూడోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ-ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నాయి.
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమికి క్లియర్ కట్ మెజార్టీ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తును స్టార్ట్ చేసింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో ఇవాళ ( బుధవారం) సమావేశం కావాలని నిర్ణయించింది.
Lok Sabha Election Results 2024, bjp, Elections Results, Elections Results 2024, INDIA Bloc, Lok Sabha Elections Results, Lok Sabha elections-2024, NDA, PM Modi, Lok Sabha Election Results 2024 LIVE UPDATES
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గెలిచింది.. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే మంత్రం గెలిచిందన్నారు.
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్ది మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు నూతన అధ్యాయనికి శ్రీకారం చుట్టారు.. వైసీపీకి డబుల్ డిజిటల్ కూడా దక్కకపోవడాన్ని చూస్తే ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో అర్ధం అవుతుందన్నారు.
2024 లోక్సభ ఎన్నికల్లో దేశంలో అత్యంత హాట్స్టేట్ సీట్లలో ఒకటైన వారణాసి సీటు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి నరేంద్ర మోడీ ఇక్కడ నుంచి మూడోసారి గెలుపొందారు. కాగా.. ఈరోజు వారణాసిలో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తొలి రౌండ్ నుంచి మోడీ వెనుకంజలో ఉన్నారు. ఆ తర్వాత.. పుంజుకోగా 1.5 లక్షలకు పైగా ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.