Modi's swearing-in: ఇక లాంఛనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారం చేపట్టబోతోంది. నరేంద్రమోడీ వరసగా మూడోసారి దేశ ప్రధాని కాబోతున్నారు.
NDA: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే పక్షాలు సంసిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్డీయే భాగస్వామ పక్ష నేతలు ప్రధాని నరేంద్రమోడీ ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటు పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
PM Modi: గెలుపోటములు రాజకీయాల్లో భాగమే అని చివరి క్యాబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందు నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న ప్రధాని మోదీ బీజేపీ ఈసారి 240 సీట్లు గెలుచుకుంది .
PM Modi: లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమి ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రాబోతోంది. రికార్డు స్థాయిలో వరసగా మూడోసారి అధికారంలోకి వస్తూ చరిత్ర సృష్టించింది.
PM Modi: ప్రధాని పదవికి నరేంద్రమోడీ రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపొందింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మంత్రిమండలితో సహా రాజీనామా సమర్పించారు.
బీజేపీ గెలిచిన 8 చోట్ల బీఆర్ఎస్ పార్టీ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయిందని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. ఏడు చోట్ల బీజేపీని గెలిపీయించింది బీఆర్ఎస్.. వారి ఆత్మబలిదానాలు చేసి అవయవ దానం చేసింది బీజేపీకి.. నేను ఎన్నికలో ఇదే ఆరోపణ చేస్తే బీఆర్ఎస్ నాతో వితండవాదం చేసింది.
మా ప్రయాణం ఎన్డీఏతోనే అని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. మేం ఎన్డీఏలో ఉన్నాం.. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నా.. ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నాం అని వెల్లడించారు.
నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోతుంది. అయితే గత ఎన్నికల కంటే తక్కువ స్థానాలు రావడంతో ఈ మంత్రివర్గ సమావేశానికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సూపర్ విక్టరీ సాధించింది.. దీంతో.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వేదికగా ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినబాట పట్టనున్నారు టీడీపీ చీఫ్.. ఇక, ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..