Naseeruddin Shah: సీనియర్ సినీనటుడు నసీరుద్ధీన్ షా ప్రధాని నరేంద్రమోడీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో గెలిచి మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. మోడీ మంత్రివర్గంలో ముస్లిం ప్రతినిధి లేకపోవడం బాధాకరమని అన్నారు. భారతీయ ముస్లింలను తాను ద్వేషించనని చెప్పడానికి మోడీ తన తలపై ముస్లింటోపీ ధరించడాన్ని చూడాలనుకుంటున్నానని ఇంటర్వ్యూలో చెప్పారు.
Read Also: Kuwait fire: 49కి చేరిన మృతుల సంఖ్య.. మరో 40 మంది ఆస్పత్రిలో చికిత్స
భారతదేశ చరిత్రలో తొలిసారిగా కేబినెట్‌లో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకపోవడం నిరాశపరిచిందని, అయితే, ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదని, దేశంలో ముస్లింలను ద్వేషించడం ఆనవాయితీగా మారిందని అన్నారు. దేశంలోని ముస్లింలలో ఆందోళన పెరిగిందని మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారని చెప్పారు. ఇది ప్రాతినిధ్యాన్ని పొందే విషయమని, ఇది హిందువులు లేదా ముస్లింలు ఒంటరిగా చేయాల్సిన పనికాదని, మనం కలిసి చేయాల్సిన పని అని నసీరుద్ధీన్ షా అన్నారు.
ప్రధాని మోడీ ముస్లిం టోపీని ధరించాలని తాను కోరకుంటున్నానని, ఈ టోపీ ధరించడం ఒక సందేశం అవుతుందని చెప్పారు. 2011లో ఓ కార్యక్రమంలో మౌలావిలు మోడీకి టోపీ అందించినప్పుడు అతను దానిని ధరించడానికి నిరాకరించాడని, ఆ జ్ఞాపకాన్ని చెరిపివేయడం కష్టమని చెప్పారు. అయితే, మోడీ టోపీని ధరిస్తే, నేను ఒకే దేశపు పౌరులను ద్వేషించనని చెప్పినట్లు అవుతుందని అన్నారు. ముస్లిం సమాజం విద్యతో సమా ముఖ్యమైన సమస్యలకు బదులుగా ఇతర అంశాలపై దృష్టిపెట్దిందని నసీరుద్దీన్ షా అన్నారు. మదరసా, హిజాబ్, సానియా మీర్జా స్కర్టు పొడవుకు బదులుగా సమాజంలో విద్య, ఆధునిక ఆలోచనలపై దృష్టి పెట్టాలని చెప్పారు.