Team India: 17ఏళ్ల కల నెరవేరిన వేళ..ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్న భారత్ జట్టు..
- నెరవేరిన 17 ఏళ్ల కల
- భావోద్వేగానికి గురైన క్రీడాకారులు
- ఇంతటి గొప్ప విజయానికి కీలకంగా వ్యవహరించిన హార్దిక్.. విరాట్.. రోహిత్ కన్నీటి పర్యంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించి విశ్వవిజేతగా మారింది. ఎట్టకేలకు భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయతీరాలకు చేర్చారు. భారత జట్టు పోరాటం చేసివిజయ కిరీటాన్ని సంపాదించడంతో సంబరాలు మొదలయ్యాయి. బార్బడోస్ గడ్డపై రోహిత్ సేన జెండా పాతింది. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఆఖరి బంతిని హార్దిక్ పాండ్యా వేయగానే.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ సహా అందరూ ఏడ్చారు. గత 17 ఏళ్ల నిరీక్షణకు ఫలితం లభించిన సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యారు. తన సారథ్యంలో 17 ఏళ్ల కల నెరవేరడంతో కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీటి పర్యంతమయ్యారు. భారత్ జెండాను అక్కడ మైదానంలో పాతాడు.
READ MORE: Ramesh Rathod: ఉట్నూర్ లో నేడు మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ అంత్యక్రియలు..
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
హార్దిక్ కన్నీటిపర్యంతం..
ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా ట్రోల్‌కు గురైన హార్దిక్.. విజయంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్ శర్మ అభిమానులకు అభివాదం చేసి కన్నీళ్లను అదుపు చేసుకునేందుకు ప్రయత్నించాడు. బార్బడోస్‌లో భారత్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత, రోహిత్ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని పాతిపెట్టినప్పుడు. హార్దిక్ భారత జెండాతో పిచ్‌పైకి వచ్చి ముద్దాడాడు.
READ MORE:Suryakumar Yadav Catch: ‘సూర్యా’ భాయ్.. చరిత్రలో నిలిచిపోయే క్యాచ్ (వీడియో)!
జట్టు విజయంలో విరాటుడి పాత్ర కీలకం..
అమెరికా, వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచకప్‌లో అజేయంగా నిలిచిన భారత జట్టుకు సీజన్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో 75 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లి.. ఫైనల్‌లో హీరోగా నిలిచి భారత్ విజయానికి పునాది వేశాడు. 2024 టీ-20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో 59 బంతుల్లో 76 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తను కూడా భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. “ఇది నా చివరి టీ20 ప్రపంచకప్, మేం దీన్ని గెలవాలనుకున్నాం. భారత్‌కు ఇదే నా చివరి టీ20. పదవీ విరమణ చేయడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. మరియు కొత్త తరం ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది బహిరంగ రహస్యం.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!