Jairam Ramesh: మణిపూర్ సందర్శించేందుకు ప్రధానికి తీరిక దొరకడం లేదా..?
- మణిపూర్ సమస్యపై మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..
- అక్కడి వెళ్లేందుకు తీరక లేదా అని ప్రశ్నించిన జైరాం రమేష్..
- కేంద్రానికి మణిపూర్ సమస్య పట్టడం లేదని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jairam Ramesh: ఏడాది కాలంగా మణిపూర్ సమస్య చెలరేగుతోంది. కుకీ, మైయిటీ కమ్యూనిటీల మధ్య జరిగిన జాతి ఘర్షణలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గతంతో పోలిస్తే పరిస్థితి కొంతమేర ప్రశాంతంగానే ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు కాంగ్రెస్ మణిపూర్ సమస్యను మరోసారి లేవనెత్తింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. ఆ ప్రాంత ప్రజల్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అన్నింటికి ప్రధాని మోడీకి సమయం ఉంటుంది కానీ మణిపూర్ సందర్శించేందుకు ప్రధానికి తీరిక దొరకడం లేదని విమర్శించారు.
Read Also: Team India Prize Money: టీమిండియాకు గుడ్‌న్యూస్.. రూ.125 కోట్ల నగదు బహుమతి
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
మణిపూర్‌లో గతేడాది ఇదే సమయానికి మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ రాజీనామాపై పెద్ద డ్రామా జరిగిందని, అప్పటి నుంచి అక్కడి ప్రజల వేదన కేంద్రానికి పట్టడం లేదని దుయ్యబట్టారు. అనేక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ప్రధానికి సమయం దొరికిందనిన, కానీ నిత్యం సమస్యలను ఎదుర్కొంటున్న మణిపూర్ సందర్శించేందుకు తీరిక లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, కనీసం ఆ సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యేందుకు సిద్ధంగా లేరని ఎక్స్ వేదికగా ఆరోపించారు.
గతేడాది మే నెలలో మణిపూర్‌లో కుకీ, మైయిటీ తెగల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్టీ హోదా ఇచ్చే అంశాన్ని కుకీలు వ్యతిరేకించడంతో ఇరు వర్గాల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 225 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు.
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!