Amit Shah: ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఉపాధి అవకాశాలలో కొత్త శకాని నాంది పలకడం ద్వారా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు 2024-25 బడ్జెట్ సహకరిస్తుందని ఆయన అన్నారు.
PM Modi: కేంద్ర బడ్జెట్ 2024 సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.48.21 లక్షల కోట్లతో 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టారు. భారతదేశ అభివృద్ధికి ఈ బడ్జెట్ పునాది వేస్తుందని ప్రధాని అన్నారు.
బీహార్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ నుంచి నితీష్ కుమార్ బయటకు రావాలని.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.