రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ఛాన్స్ లేకుండా రోడ్లపై భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఢిల్లీ నుంచి నడుస్తుంది.. వారు ఢిల్లీకి వెళ్లకపోతే, లాహోర్‌కు పంపించాలా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలోని పంజాబ్ రైతులు ‘ఢిల్లీ చలో’ కవాతును ఫిబ్రవరి 13వ తేదీన స్టార్ట్ చేశారు.
PM Modi Ukraine Tour: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. రష్యా సైనికుల ఆగడాలు మాత్రం ఆగట్లేదు. ఇప్పటి వరకు దాదాపు 10,000 వేల మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా సైన్యం చేతిలో బంధీలుగా ఉన్నట్టు తెలుస్తుంది.
NITI Aayog: నీతి ఆయోగ్ 9వ పాలకమండలి మీటింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ (శనివారం) ఉదయం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరగబోతుంది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ప్రధాని మోడీపై ఎంపీ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడిందన్నారు. ఇప్పుడు మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పదేళ్ల క్రితం దేశ ఆర్థిక వ్యవస్థపై అందరూ ఆందోళన చెందేవారని కంగనా పేర్కొన్నారు.
BJP New President: భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం ముగిసిపోవడంతో పార్టీ తదుపరి అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగిస్తారో అనే విషయం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. జులై నెలలో తదుపరి అధ్యక్షుడు బాధ్యతలు చేపడతారని సంబంధిత వర్గాలు తెలిపినప్పటికి.. తాజాగా ఆగస్టు నెల చివరి నాటికి కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Narendra Modi: అగ్నిపథ్ పథకంపై విపక్షాలు చేస్తోన్న విమర్శలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. భారత బలగాలకు సంబంధించి పెన్షన్ నిధులు ఆదా చేసేందుకే ఈ పథకం తీసుకువచ్చారంటూ చేస్తోన్న కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఇండియన్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించింది. హిట్‌లీస్ట్‌లో గుర్తించిన 55 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అంతమొందించడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0ను స్టార్ట్ చేయబోతుంది.
Kargil Vijay Diwas: 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్గిల్‌లో పర్యటించనున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర అమరవీరులకు నివాళులర్పించనున్నారు.