కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ తీపి కబురు అందించింది. సీపీఎస్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) అమలు చేయాలని నిర్ణయించింది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తుంది. కేంద్రం ఈ నిర్ణయంతో వీరంతా యూపీఎస్ పరిధిలోకి రానున్నారు.
PM Modi: దాయాది దేశం పాకిస్తాన్ భారత ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరగబోతున్న షాంఘై కోఆపరేషణ్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సిహెచ్‌జి) సమావేశానికి పాకిస్తాన్ పీఎం మోడీతో పాటు ఇతర నాయకులను ఆహ్వానించినట్లు సమాచారం.
ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వక్ఫ్ బోర్డును విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని, దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ మెంబర్లను పెట్టాలని ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించారు. వక్ఫ్‌కు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశపెడుతుందని, వక్ఫ్‌ను ఖతం చేయాలని అనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలు లేకుండా బీజేపీ చేయాలనుకుంటుందని అసదుద్దీన్ మండిపడ్డారు. ఈరోజు దారుస్సలాంలో ఎంపీ…
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS) పథకం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ చూసి గర్విస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదిక 'X'లో తెలిపారు. 'ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS).. ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వబోతోంది. ఈ చర్య వారి సంక్షేమం.. సురక్షితమైన భవిష్యత్తు పట్ల మా ప్రభుత్వ…
ప్రధాని మోడీ తొలిసారి ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ 'చారిత్రాత్మకం' అని అభివర్ణించారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలో భాగమని పేర్కొన్నారు. వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధాలు, వ్యవసాయం, విద్య రంగాలపై మోడీ-జెలెన్స్కీ మధ్య చర్చ జరిగినట్లు జైశంకర్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. 'యుద్ధానికి దూరంగా ఉండడమే భారత్ ఎంచుకున్న రెండో మార్గం అని అన్నారు. తాము యుద్ధానికి దూరంగా ఉన్నాము.. భారత్ మొదటి రోజు నుండి పక్షపాతం కలిగి ఉంది. మా వైపు శాంతి ఉంది, మేము యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహాత్మా గాంధీ భూమి నుండి మేము వచ్చాము.' అని ఉక్రెయిన్…
PM Modi Reached Ukraine: రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్ల తర్వాత ప్రధాని మోడీ ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. మోడీ గురువారం రాత్రి పోలాండ్ నుండి బయలుదేరాడు. 10 గంటల రైలు ప్రయాణం తర్వాత వారు ఉక్రెయిన్ చేరుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ప్రధాని మోదీ 7 గంటలపాటు గడపనున్నారు. ఇకపోతే, ఉక్రెయిన్ లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కారణంగా…
National Space Day: భారతదేశం నేడు (ఆగస్టు 23) జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇది దేశం యొక్క మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం. ఇక ఈ ఏడాది నుండి ప్రతి సంవత్సరం చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన వార్షికోత్సవం సందర్భంగా జరుపుకుంటారు. తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేయడం ద్వారా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది ఆగస్టు 23న భారత అంతరిక్ష…
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన యావత్తు దేశాన్ని కుదిపేస్తున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా రోజు 90 అత్యాచారాలు జరుగుతున్నాయని.. వీటిని అరికట్టడానికి కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రధాని మోడీని లేఖలో కోరారు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అత్యాచార ఘటనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కోల్‌కతాలోని ఆర్జి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరంతరం విమర్శలకు గురవుతున్న తరుణంలో సీఎం మమత ప్రధానికి లేఖ రాయడం చర్చనీయంశంగా మారింది.