One Nation One Election: బీజేపీ హామీ ‘‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’’ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుత హాయాంలోనే బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ కోసం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనుంది. దీంతో త్వరలోనే ఇది వాస్తవ రూపం దాల్చబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్..
ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి వరసగా అధికారంలోకి వచ్చి 100 రోజుల పూర్తయిన సమయంలో ఈ నివేదిక వెలువడింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది బిజెపి తన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక వాగ్దానాలలో ఒకటి. ఈ ఏడాది భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్ర కోట నుంచి ప్రధాని ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఏకకాల ఎన్నికల చట్టం కోసం అందరూ కలిసి రావాలని అభ్యర్థించారు.
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ‘‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’’పై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. తొలి దశల్లో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీకలు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని మార్చిలో ప్రతిపాదించింది. 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని, దేశవ్యాప్తంగా ఎన్నికల చక్రాన్ని సమకాలీకరించాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. ప్రస్తుతం లోక్‌సభకి పలు రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరు కాలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పలు సందర్భాల్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఎన్నికలు మూడు లేదా నాలుగు నెలలు మాత్రమే నిర్వహించాలని, ఐదేళ్ల పాటు రాజకీయాలు చేయకూడదని చెప్పారు.