Traffic Restrictions in Srisailam and Kurnool District: శ్రీశైలం వెళ్తున్నారా? అయితే, ఇది మీ కోసమే.. ఎందుకంటే శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.. తాత్కాలికంగా పూర్తిగా ట్రాఫిక్ నిలిపివేయనున్నారు.. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. మొదట శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోనున్నారు ప్రధాని.. అయితే, 16వ తేదీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు…
గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరుకాకపోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పుపట్టారు. శాంతి సదస్సుకు రావాలని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు, ట్రంప్ సంయుక్తంగా ఆహ్వానించారు. కానీ మోడీ వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాని మోడీని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. అది కూడా ప్రపంచ అగ్ర నాయకులంతా ఒక చోట నిలబడి ఉండగా.. అంతేకాకుండా పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పక్కనే ఉండగా ఈ సంఘటన జరగడం విశేషం. ఈజిప్టులో గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరిగింది.
CBN Meets PM Modi: హస్తినకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. సుమారు 45 నిముషాల పాటు ప్రధాని మోడీతో చంద్రబాబు నాయుడు ముఖాముఖి సమావేశం జరిగింది.. ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు ప్రధాని మోడీ.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. మొదట శ్రీశైలం మల్లికార్జున స్వామి , భ్రమరాంబికా దేవిని దర్శించుకోనున్న ఆయన.. కర్నూలులో నిర్వహిస్తున్న “సూపర్ జీఎస్టీ-…
కేంద్రమంత్రి సురేష్ గోపి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సినిమాల్లో నటించకపోవడం వల్ల తన ఆదాయం తగ్గిందని.. తిరిగి సినిమాల్లోకి వెళ్లి ఆదాయాన్ని చక్కదిద్దుకుంటానని వెల్లడించారు. ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు.
Sergio Gor: భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ శనివారం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఇద్దరు రక్షణ, వాణిజ్యం, సాంకేతికతో సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వైట్ హౌజ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి ఉన్న సంతకం చేసిన ఫోటోను ఆయన ప్రధానికి బహూకరించారు. మోడీకి బహూకరించిన ఫోటోలపై ట్రంప్ ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు గొప్పవారు’’ అని రాశారు.
Ayodhya Ram Temple: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం నవంబర్ 25తో ముగియనుంది. ఈ సందర్భంగా అయోధ్య ప్రధాన ఆలయంపై జెండాను ఎగురవేయడానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాని నరేంద్రమోడీని అధికారికంగా ఆహ్వానించింది. ఈ వేడుకలు రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెబుతాయి.
ప్రధాని మోడీ-యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఆహ్లాదకరంగా గడిపారు. ముంబైలో చాలా ఉల్లాసంగా కనిపించారు. రెండు రోజుల పర్యటన కోసం యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఇండియాకు వచ్చారు. గురువారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.