భారత్-యూకే సహకారం కొత్త శిఖరాలకు తీసుకెళ్లబోతున్నాయని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబైలో ఇండియా-యూకే సీఈవో ఫోరమ్‌లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు.
CM Chandrababu: మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై దృష్టిసారించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సీఎస్, డీజీపీలు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు…
PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ హయాంలోని యూపీఏ పాలనపై విమర్శలు గుప్పించారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ‘‘బలహీనత’’ను ప్రదర్శించిందని ఆరోపించారు. అప్పటి రాజకీయ నిర్ణయాలు మరో దేశం నుంచి వచ్చిన ఒత్తిడి ద్వారా ప్రభావితమయ్యాయని బుధవారం ఆరోపించారు. ముంబై దేశంలోని అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటి అని, అందుకే ఉగ్రవాదులు 26/11…
Lashkar-e-Taiba: ప్రధాని నరేంద్రమోడీని బెదిరిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది. సింధు జల ఒప్పందం నిలిపేయడం ద్వారా భారత్ పాకిస్తాన్లో వరదలకు కారణమైందని నిందించాడు. ప్రధాని మోడీకి గుణపాఠం చెప్పే విధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను అభ్యర్థిస్తామని వీడియో సందేశంలో కసూరీ చెప్పాడు.
ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అవుననే సమాధానం వస్తుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన మైథిలి ఠాకూర్.. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు బీజేపీ నేతల సమావేశాలే ఉదాహరణగా ఉన్నాయి.
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సోమవారం అమానుష ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై ఓ వృద్ధ న్యాయవాది రాకేశ్ కిషోర్(71) ఊహించని రీతిలో షూ విసిరేందుకు ప్రయత్నించాడు.
PM Modi: ప్రధాన న్యాయమూర్తిపై దాడి ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా ప్రధాని మోడీ స్పందించారు. బి.ఆర్. గవాయ్‌తో ఫోన్లో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని మోడీ తెలిపారు. మన సమాజంలో ఇటువంటి చర్యలకు చోటు లేదు. ఇది చాలా సిగ్గుచేటని అన్నారు. ఈ మేరకు మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. "భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ జీతో మాట్లాడాను. ఈరోజు…
మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గతేడాది అల్లర్లతో మణిపూర్ అట్టుడికింది. పదులకొద్ది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి పదవికి బిరెన్ సింగ్ రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది.
పశ్చిమబెంగాల్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. డార్జిలింగ్‌లో కొండచరియలు విరిగిపడి దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్ ఒక ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నారు. ఇక ప్రధాని మోడీ ఆధునిక రావణుడికి చిహ్నం అని తెలిపారు. ప్రధాని మోడీ ఎక్కువ కాలం కొనసాగలేరని.. త్వరలోనే ఆయన లంకలో అగ్నిప్రమాదం జరుగుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.