Microsoft: మైక్రోసాఫ్ట్ బాస్ సత్య నాదెళ్ల మంగళవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిన ఇండియాలో పెడుతున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించారు. ఇది భారతదేశ ఆశయాలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. భారతదేశ ‘‘AI ఫప్ట్ ప్యూచర్’’ నిర్మించేందుకు, డెవలప్ చేసేందుకు $17.5 బిలియన్లు( రూ. 1.5 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.
Read Also: Arunachal Pradesh: అక్రమ బంగ్లాదేశీయులపై తిరగబడుతున్న అరుణాచల్ ప్రజలు..
భారతదేశం AI అవకాశంపై స్ఫూర్తిదాయకమైన సంభాషణలకు సత్యానాదెళ్ల ప్రధాని నరేంద్రమోడీకి థాంక్స్ చెప్పారు. ఆసియాలోనే మైక్రోసాఫ్ట్ అతిపెద్ద పెట్టుబడి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. మోడీతో మీటింగ్ గురించి నాదెళ్ల ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘ భారతదేశ ఏఐ అవకాశంపై స్పూర్తిదాయకమైన సంభాషణలకు ప్రధాని నరేంద్రమోడీకి ధన్యవాదాలు, దేశ ఆశయాలకు మద్దతు ఇవ్వడానికి, ఇండియా ఏఐ ఫస్ట్ ఫ్యూచర్‌కు అవసరమైన మౌలికసదుపాయాలు, నైపుణ్యాలు, సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి US$17.5 బిలియన్ల పెట్టుబడి నిబద్ధతకు కట్టుబడి ఉన్నాము’’ అని అన్నారు.
గూగుల్, అమెజాన్ కూడా భారత్‌లో డేటా సెంటర్లు, ఏఐ హబ్‌ల ఏర్పాటులో బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించాయి. అక్టోబర్‌లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఏపీలోని విశాఖపట్నంలో ఏఐ హబ్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికను వెల్లడించారు.
Thank you, PM @narendramodi ji, for an inspiring conversation on India’s AI opportunity. To support the country’s ambitions, Microsoft is committing US$17.5B—our largest investment ever in Asia—to help build the infrastructure, skills, and sovereign capabilities needed for… pic.twitter.com/NdFEpWzoyZ
— Satya Nadella (@satyanadella) December 9, 2025