హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. లాడ్వా నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. మంగళవారం పార్టీ ఆఫీసులో పూజ నిర్వహించి.. అనంతరం ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి సైనీ స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లారు.
Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలోనే భారతదేశ పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇంకా పర్యటన తేదీలు ఖరారు కానప్పటికీ.. ఈ ఏడాది చివరి నాటికి భారత్లో పర్యటించే ఛాన్స్ ఉందని ఉక్రెయిన్ రాయబారి తెలిపారు.
Giorgia Meloni: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడంలో భారత్ పాత్ర పోషిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శనివారం అన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో భారత్, చైనా పాత్ర పోషించాలని కోరారు.
ప్రధాని మోడీ ముందు తన భర్త కేజ్రీవాల్ ఎప్పటికీ తలవంచరని సునీతా కేజ్రీవాల్ అన్నారు. హర్యానాలో సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్తో పొత్తు కుదరకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు శనివారం ఆప్ ప్రకటించింది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో శనివారం సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
PM Narendra Modi arrives in Delhi after concluding his three day visit to Singapore and Brunei: మూడు రోజుల సింగపూర్, బ్రూనై పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అర్థరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోడీ తన సింగపూర్ పర్యటన వీడియోను పంచుకున్నారు. ఇందులో భాగంగా నా సింగపూర్ పర్యటన చాలా విజయవంతమైంది.. ఇది ఖచ్చితంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.. రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సింగపూర్…
మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. శివాజీ విగ్రహం కూలిపోవడం మరాఠా దిగ్గజానికి అవమానకరమని అన్నారు.
Bangladesh: బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటా రద్దుని కోరుతూ చేసిన నిరసనలు హింసాత్మకంగా మారి, చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియాకు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె గద్దె దిగిన తర్వాత బంగ్లా వ్యాప్తంగా హిందువులపై మతోన్మాద మూకలు దాడులకు తెగబడ్డాయి.
Ukraine conflict: ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటన తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి చర్చలు మొదలవుతాయనే సంకేతాలు వెలువడ్డాయి. దీనికి బలం చేకూరుస్తూ రష్యా అధినేత పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తులుగా వ్యవహరించొచ్చని పుతిన్ గురువారం చెప్పారు. యుద్ధం ప్రారంభంలో టర్కీ మధ్యవర్తిత్వం చేసి కొన్ని ఒప్పందాలను చేసుకున్నప్పటికీ, చివరకు అవి ఎన్నడూ అమలు చేయబడలేదని చెప్పారు. ‘‘మేము మా స్నేహితులను, భాగస్వాములను గౌరవిస్తాము, వారు ఈ…
PM Modi: సింగపూర్ పీఎం వాంగ్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటనకు అక్కడికి వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (గురువారం) ఉదయం సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ కంపెనీ అయిన ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్ను సందర్శించారు.