PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), ఆర్జేడీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఈ మూడు పార్టీలు జార్ఖండ్ రాష్ట్రానికి అతిపెద్ద శత్రువులని ఆరోపించారు. జార్ఖండ్ని కాంగ్రెస్ చాలా కాలంగా ద్వేషిస్తోందని, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు ఆర్జేడీ ఇప్పటికీ ప్రతీకారం కోరుకుంటోందని ఆయన అన్నారు. అధికార హేమంత్ సొరెన్ పార్టీ జేఎంఎం ఆదివాసీ వర్గాలకు ద్రోహం చేస్తుందని ఆరోపించారు. ఆదివాసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వారు, ఇప్పుడు వారి అటవీ భూమిని ఆక్రమించిన వారితో జతకట్టారని…
Vande Bharat Express: నేటి (ఆదివారం) నుంచి జార్ఖండ్, గుజరాత్, ఒడిశాలో మూడు రోజుల కార్యక్రమాల సందర్భంగా దేశంలోని మొట్టమొదటి ‘వందే మెట్రో’తో సహా డజను వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. వీటిలో న్యూఢిల్లీ-వారణాసి మధ్య నడిచే వందే భారత్లో 20 కోచ్లు ఉంటాయి. భుజ్-అహ్మదాబాద్ మధ్య వందే మెట్రో సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 15 నుంచి 17 మధ్య జార్ఖండ్, గుజరాత్, ఒడిశాలో ప్రధాని మోదీ…
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 5న ఓటింగ్ జరగనుంది. బీజేపీ ప్రచారానికి పదును పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు కురుక్షేత్ర థీమ్ పార్క్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కురుక్షేత్రలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Deepjyoti: ప్రధాని నరేంద్రమోడీ నివాసంలోకి కొత్త సభ్యుడు చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానినే ఎక్స్ వేదికగా చెప్పారు. ఇంతకీ ఆ కొత్త సభ్యుడు ఎవరో కాదు ‘‘దీప్ జ్యోతి’’ అనే దూడ. ప్రధాని నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్లోని గోమాత ఒక దూడకు జన్మనిచ్చినట్లు ప్రధాని పోస్ట్ చేశారు. తన నివాసంలో చిన్న దూడతో గడిపిన వీడియోని పంచుకున్నారు.
PM Modi: అమెరికాలో రాహుల్ గాంధీ టీమ్ ఇండియా టుడే జర్నలిస్టుపై జరిపిన దాడిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్రూరత్వానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో కాశ్మీర్లోని దోడాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అమెరికాలో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఉద్దేశిస్తూ, రాహుల్ గాంధీ ‘మొహబ్బత్కి దుకాన్’ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
PM Modi: దశాబ్దం తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఈరోజు (శనివారం) దోడా జిల్లాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కుటుంబం అనే మూడు కుటుంబాలు దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
విశాఖకు "వందేభారత్" రైళ్లు క్యూ కడుతున్నాయి. ఎల్లుండి నుంచి మరో కొత్త సర్వీసు ప్రారంభంకాబోతోంది.. భారతీయ రైల్వేలలో వాల్టేర్ డివిజన్ ది ప్రత్యేక స్థానం. విశాఖ జంక్షన్ మీదుగా రోజూ 120 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సాధారణ రోజుల్లో లక్ష దాటుతుంది. అదే సెలవులు, పర్వదినాల్లో అయితే ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపు. అయితే, డిమాండ్ కు అనుగుణంగా రైళ్ల ఫ్రీక్వెన్ని వుండటం లేదనే విమర్శలు బలంగా వుండేవి. కానీ, వందేభారత్ ఎంట్రీ తర్వాత విశాఖ రైలు…
నార్కో టెస్ట్ లేదా నార్కో అనాలిసిస్ అని కూడా పిలుస్తారు. ఇది హిప్నోటిక్ లేదా సెమీ-కాన్షియస్ స్థితిని ప్రేరేపించే ఔషధాన్ని అందించడం ద్వారా ఒక వ్యక్తి నుండి సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగించే ఒక రకమైన పరిశోధనాత్మక విధానం.