ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం లావోస్‌లోని వియంటియాన్ చేరుకున్నారు. ప్రధాని మోడీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధాని మోడీ గురువారం లావోస్‌కు చేరుకున్నారు.
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలు వద్దంటూ పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఒకే దేశం-ఒకే ఎన్నికలపై కేంద్రం ముందడుగు వేసింది.
Ratan Tata: దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచిన రతన్ టాటా.. బీపీ అకస్మాత్తుగా పడిపోవడంతో సోమవారం నుంచి ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరారు. అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు రతన్ టాటా. ఈ సందర్బంగా దేశ, విదేశ ప్రముఖులు…
PM Modi: హర్యానాలో బీజేపీ సంచలన విజయం సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కైవసం చేసుకుంది. వరసగా మూడోసారి అధికారం చేపట్టబోతోంది. జమ్మూ కాశ్మీర్లో అధికారం చేపట్టలేకపోయినప్పటికీ 90 స్థానాల్లో 29 స్థానాలను సాధించింది. ఇక రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చావుదెబ్బతింది. రాహుల్ గాంధీ ప్రచారం, అగ్నివీర్ అంశం, నిరుద్యోగం, వినేష్ ఫోగట్ చేరిక, రైతు ఉద్యమాలు ఇలా ఏదీ కూడా బీజేపీ గెలుపుని ఆపలేకపోయాయి. 37 సీట్లలోనే కాంగ్రెస్ గెలిచింది. జమ్మూ…
న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూట్రిషన్ సెక్యూరిటీ కోసం కేంద్రం రూ. 17,082 కోట్లు కేటాయించింది. వంద శాతం కేంద్రం నిధులు కేటాయించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది.
Haryana CM Meet PM Modi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మూడోసారి గెలిచి కాంగ్రెస్‌ను బీజేపీ మట్టికరిపించింది. ఈ సందర్భంగా ఈరోజు (బుధవారం) హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.
ఎన్సీ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధాని మోడీకి సమర్పిస్తామన్నారు. నియోజక వర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదా లాంటి వాటి మీద తీర్మానం చేస్తామన్నారు. కొందరు నేతలు జమ్మూకశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Central Cabinet Meeting: నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. ఇవాళ (బుధవారం) ఉదయం 10:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది.
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (బుధవారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలో సుమారు 7,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
హర్యానా ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారని ప్రధాని మోడీ అన్నారు. హర్యానాలో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు హాజరయ్యారు.