బంగ్లాదేశ్‌లోని జెషోరేశ్వరి ఆలయంలో దుర్గామాత కిరీటం చోరీకి గురైంది. 2021లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు.
Canada–India Row: లావోస్‌లో నిర్వహించిన భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరిపినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. దీనిపై భారత్ రియాక్ట్ అయింది. ఇరువురి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది.
PM Modi: ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు గ్లోబల్ సౌత్ దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లోని సత్ఖిరా నగరంలోని శ్యామ్నగర్లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలోని బంగారు కిరీటం అపహరణకు గురైంది. ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి.
ప్రధాని మోడీ లావోస్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన కోసం గురువారం మోడీ లావోస్ వెళ్లారు. 21వ శతాబ్దం భారతదేశం, ఆసియాన్ దేశాల శతాబ్దంగా ప్రధాని మోడీ అభివర్ణించారు. లావోస్ వేదికగా 21వ ‘ఆసియాన్- ఇండియా సమ్మిట్’లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు.
ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. 2019లో తాను ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో హూస్టల్‌లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ సభపై మాట్లాడారు. కమిడియన్స్ ఆండ్రూ షుల్ట్జ్, ఆకాష్ సింగ్‌తో కలిసి ‘‘ఫ్లాగ్రాంట్’’ పోడ్‌కాస్టులో ట్రంప్ పాల్గొన్నారు. ఈ భేటీలో పీఎం మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ బయటకు శాంతంగా, తండ్రిలా కనిపిస్తారు కానీ, ఆయన కఠినంగా ఉండే మంచి వ్యక్తి అని అభివర్ణించారు
ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం లావోస్‌లోని వియంటియాన్ చేరుకున్నారు. ప్రధాని మోడీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధాని మోడీ గురువారం లావోస్‌కు చేరుకున్నారు.
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలు వద్దంటూ పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఒకే దేశం-ఒకే ఎన్నికలపై కేంద్రం ముందడుగు వేసింది.
Ratan Tata: దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచిన రతన్ టాటా.. బీపీ అకస్మాత్తుగా పడిపోవడంతో సోమవారం నుంచి ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరారు. అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు రతన్ టాటా. ఈ సందర్బంగా దేశ, విదేశ ప్రముఖులు…