హర్యానా ప్రజలకు, కార్మికులకు ప్రధాని అభినందనలు తెలిపారు. మోడీ హర్యానాకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'భారతీయ జనతా పార్టీకి మరోసారి స్పష్టమైన మెజారిటీని అందించినందుకు హర్యానా ప్రజలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇది అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాల విజయం. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఏ రాయిని వదిలిపెట్టబోమని నేను వారికి హామీ ఇస్తున్నాను'.అని తెలిపారు.
PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు లావోస్ పర్యటనకు వెళ్లబోతున్నారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన లావోస్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. బుడమేరు వరదలపై నివేదిక తర్వాత తొలిసారి ప్రధానిని కలిశారు. వరద సాయం, రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం, అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధుల విధులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడటం, పోలవరం నిర్మాణానికి నిధులు విడుదలపై ప్రధానితో చంద్రబాబు చర్చిస్తున్నట్లు సమాచారం.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోరా తదితరులపై భూ మోసం కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం జలంధర్, లూథియానా, గురుగ్రామ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. పంజాబ్‌లోని లూథియానాలోని సంజీవ్ అరోరా నివాసం, హర్యానాలోని గురుగ్రామ్‌తో సహా దాదాపు 16-17 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడికి బీజేపీయే కారణమని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
President Muizzu: మాల్దీవుల అధినేత మహ్మద్ ముయిజ్జు నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఇండియన్ టూరిస్టుల తమ దేశంలో పర్యటించాలని కోరారు. వారు తమ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపిస్తారని తెలిపారు.
Mohamed Muizzu: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు నాలుగు రోజుల భారత పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయన సతీమణి సాజిదా మహమ్మద్ కూడా భారత్‌లో పర్యటించనున్నారు. అధ్యక్షుడు ముయిజ్జూ పాలంలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఆ తరువాత, ముయిజు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అక్కడ అతనికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…
PM Modi: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బా నృత్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకమైన పాటను రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి పాడారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను నేడు ప్రధాని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.
ఈ రోజు (సోమవారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మాల్దీవుల అధినేత ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. వీరి చర్చల ద్వారా రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశిస్తున్నారు.
Asaduddin Owaisi: మోడీ ప్రసంగాలు వినే ఉద్దేశ్యం లేకనే నేను పార్లమెంట్ కు వెళ్ళలేదని ఎం.ఐ.ఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mohamed Muizzu: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారతదేశానికి వచ్చారు. భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక చర్చల కోసం ఆదివారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ముయిజ్జూ భార్య, మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మహ్మద్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ పర్యటనలో ముయిజ్జూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమవుతారు.