భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్ తో పాటు పలువురు నేతలతో ఆయన వరుసగా సమావేశం అయ్యారు. ఇక న్యూయార్క్ చేరుకున్న మాస్క్ అక్కడ అమెరికన్ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. అనంతరం ప్రొఫెసర్ పాల్ రోమర్‌తో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అంశంపై అమెరికా పెట్టుబడిదారుడు రే డాలియోతో ప్రధాని ప్రధానంగా చర్చించారు. Read Also: Ashes Test 2023:…
PM Modi: రష్యాపై భారత వైఖరి స్పష్టంగా ఉందని, భారత వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలుసు అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికా పర్యటనకు వెళ్తున్న సమయంలో వాల్ స్ట్రీట్ జర్నల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం శాంతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు.
సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, చట్ట నియమాలను పాటించడం, విభేదాలు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడంలో మాకు నమ్మకం ఉందని, అదే సమయంలో భారత్ తన సార్వభౌమాధికారాన్ని, గౌరవాన్ని పరరక్షించడంలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 3 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు. జూన్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే విందులో పాల్గొనడంతో పాటు అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు. అయితే మోడీ పర్యటనపై దాయాది దేశం పాకిస్తాన్ తో పాటు డ్రాగన్ కంట్రీ చైనా తెగ ఉలికిపడుతున్నాయి. ఇరుదేశాల మధ్య బలపడుతున్న బంధం తమకు ఎక్కడ నష్టాన్ని కలిగిస్తుందో అని తెగ భయపడుతున్నాయి.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల అమెరికా పర్యటనకు ఈ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఈ పర్యటన గురించి ఆయన ట్వీట్ చేశారు. ఇది అమెరికా-ఇండియా భాగస్వామ్య శక్తికి ప్రతిబింబం అని పేర్కొన్నారు. అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో పర్యటన, ప్రాధాన్యత గురించి వివరాలను తెలియజేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు.‘‘ ప్రెసిడెంట్ జో బైడెన్, ప్రథమ మహిళ డాక్టర్. జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు నేను యూఎస్ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నాను. మన…
PM Modi US Visit: అమెరికా పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరారు. భారత కాలమాన ప్రకారం జూన్ 21న తెల్లవారుజామున 1.30 గంటలకు వాషింగ్టన్ లోని ఆండ్రూస్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో దిగాల్సి ఉంది.
PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా స్టేట్ విజిట్ కు వెళ్తున్నారు. మోడీ పర్యటనకు అమెరికా ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ప్రధాని మోడీకి వైట్ హౌజులో ఆతిథ్యం ఇవ్వనున్నారు.
PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన చాలా ప్రత్యేకం కానుంది. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రధాని ఉంటారు.