Micron: భారతదేశంలో చిప్ ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్లు సెమికండక్టర్స్ తయారీ దిగ్గజం మైక్రాన్ ప్రకటించింది. గుజరాత్ లో 825 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 6,760 కోట్లు) పెట్టుబడితో ఈ ప్యాక్టరీ నెలకొల్పనున్నట్లు నిర్దారించింది. 2023లోనే మైక్రాన్ ఫ్యాక్టరీ నెలకొల్పే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
PM Modi: యూఎస్ కాంగ్రెస్ వేదికగా ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇఫ్స్ అండ్ బట్స్ లేవని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మరియు ఎగుమతి చేస్తున్న అటువంటి దేశాలను కట్టడి చేయాలని అన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని, దానిని ఎదుర్కోవడంలో ఎలాంటి అపోహలు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గురువారం అమెరికా కాంగ్రెస్ ఉభయసభల సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వైట్‌హౌస్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జిల్ బిడెన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. వైట్‌హౌస్‌లో నాకు లభించిన గౌరవం 140 కోట్ల మంది భారత ప్రజల గౌరవమని ఆయన అన్నారు.
PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనపై కీలక ఒప్పందం కుదిరింది. ఆర్టెమిస్ ఒప్పందంపై భారత్, అమెరికా సంతకాలు చేశాయని వైట్‌హౌస్ గురువారం ప్రకటించింది.
H-1B Visa: ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్-అమెరికాల మధ్య బంధం మరింత బలపడనుంది. రక్షణ, సాంకేతిక విషయాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే మోడీ పర్యటన వేళ.. అమెరికా భారతీయులకు శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల అమెరికా పర్యటనలో బిజీబీజీగా గడుపుతున్నారు. ఆయనకు ప్రెసిడెంట్ జోబైడెన్, అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ లు వైట్ హౌజులోకి ఘన స్వాగతం పలికారు. అక్కడే మోడీకి బైడెన్ దంపతులు దేశం తరుపున విందు ఇచ్చారు.
PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. బుధవారం వైట్‌హౌస్‌లో ప్రధాని మోడీకి విందు ఇచ్చారు. వైట్‌హౌస్‌లో ఇరువురు దేశాధినేతలు ఫోటోలకు ఫోజులిచ్చారు. భారదదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీతాన్ని ఆస్వాదించినట్లు వైట్ హౌజ్ తెలిపింది.