CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు.. శ్రీశైలం మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత కర్నూలు శివారులో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.. ఇక, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు, వివిధ శాఖల అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
PM Modi AP Tour: మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇప్పటికే ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం.. ప్రధాని కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు.. అయితే, తన ఏపీ పర్యటనపై ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ.. ‘రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను.. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ…
PM Modi AP Tour: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. ప్రధాని మోడీ ఈ నెల 16వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన ఖరారు అయ్యింది.. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు.. ఏపీ పర్యటన కోసం.. 16న ఉదయం 7.50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు ప్రధాని.. ఉదయం 10.20కి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు.. ఇక, 10.25కి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కర్నూలు ఎయిర్‌పోర్ట్ నుంచి సున్నిపెంట హెలిప్యాడ్‌కు…
PM Modi AP Tour: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు.. ఈసారి మోడీ పర్యటన రాయలసీమల ప్రాంతంలో కొనసాగనుంది.. వచ్చే నెల అంటే అక్టోబర్ 16వ తేదీన రాష్ట్రానికి రానున్నారు ప్రధాని.. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం వెళ్లనున్న ప్రధాని మోడీ.. శ్రీశైలం మల్లికార్జునస్వామితో పాటు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఇక, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లికార్జునస్వామిని ఆయన దర్శించుకున్న తర్వాత.. కర్నూలులో నరేంద్ర మోడీ…
ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి షెడ్యూల్ ఖరారు ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 15 నిమిషాలు రోడ్డు షో, గంట పాటు సభ ఉంటుంది. ఈ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే రాజధాని పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. తాజాగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ పర్యటనకు రావాలని ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.
మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించనున్నారు. జనవరి 8న ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు రానున్నారు. రూ. 85 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు.. తూర్పు గోదావరి జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో ప్రధాని ప్రచారం కొనసాగనుంది.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి రానున్నారు ప్రధాని మోడీ.. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. అనంతరం విశాఖ జిల్లా అనకాపల్లి బయలుదేరి వెళ్తారు.. ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు..
ఏపీలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీకి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వీడ్కోలు పలికారు సీఎం వైఎస్ జగన్.. అదే సమయంలో తమ ప్రభుత్వ కోరికల చిట్టాను ఆయన చేతిలో పెట్టారు..