PM Modi AP Tour: మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇప్పటికే ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం.. ప్రధాని కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు.. అయితే, తన ఏపీ పర్యటనపై ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ.. ‘రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను.. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను.. ఆ తర్వాత, కర్నూలులో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవి.’ అంటూ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ..
కాగా, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో.. శ్రీశైలంతో పాటు.. కర్నూలు జిల్లాల్లోనూ పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. ఇక, ప్రధాని మోడీ ఏపీ టూర్ షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. ..
* 16న ఉదయం 7.50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న ప్రధాని మోడీ
* 10.20కి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు..
* 10.25కి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు బయల్దేరతారు..
* 11.10కి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు..
* 11.45కి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోన్న మోడీ..
* దర్శనం అనంతరం మధ్యాహ్నం 12.45కి భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరుకుంటారు..
* మధ్యాహ్నం 1.25కి శ్రీశైలం నుంచి సున్నిపెంటకు బయల్దేరతారు..
* మధ్యాహ్నం 1.40కి సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు..
* 2.30 రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు చేరుకోనున్న ప్రధాని మోడీ..
* 2.30 తర్వాత శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న మోడీ..
* సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ..
* 4.15 కి రోడ్డు మార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు..
* నన్నూరు హెలిప్యాడ్ నుంచి 4.40కి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు
* సాయంత్రం 4.40 తర్వాత కర్నూలు నుంచి బయల్దేరి రాత్రి 7.15కి ఢిల్లీ చేరుకోనున్న ప్రధాని మోడీ..
రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలు లో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.ఈ పనులు విద్యుత్,…
— Narendra Modi (@narendramodi) October 15, 2025