అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా జూలై 4న ప్రధాని మోదీ ఏపీకి రానున్నారు. ఉదయం 10:10 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉదయం 11 గంటలకు భీమవరంలోని సభా ప్రాంగణానికి ప్రధాని మోదీ, సీఎం జగన్ చేరుకోనున్నారు. ఇరువురు నేతలు స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి…
స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా జూలై 4న ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొననున్నారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని ఏపీలోని పలువురు ప్రముఖులకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానాలు పంపుతున్నారు. కిషన్‌రెడ్డి ఆహ్వానం పంపిన వారి జాబితాలో చిరంజీవి కూడా ఉన్నారు. Read Also:…
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ వచ్చేనెలలో ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు జూలై 4న ప్రధాని మోదీ భీమవరంలో పర్యటించి అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. జూలై 4న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి భీమవరం వెళ్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. తొలుత రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి భీమవరం వెళ్తారని భావించినా సెక్యూరిటీ కారణాల వల్ల ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.…
దేశంలో బ్రిటీష్ పాలనకు చరమగీతం పాడిన మహానుభావుల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఉంటారు. 1897 జూలై 4న విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు జన్మించారు. అయితే చిన్నతనంలోనే ఆధ్యాత్మికతకు ఆకర్షితుడు అయ్యి ఆయన చదువు మానేసి సన్యాసిగా మారి పశ్చిమగోదావరి జిల్లా అడవుల్లో నివసించేవారు. అడవుల్లో జీవనం సాగించే సమయంలోనే బ్రిటీష్ వారి అటవీ చట్టాల ద్వారా గిరిజనులపై జరుగుతున్న దాడులను అల్లూరి తన కళ్లారా చూశారు. దీంతో గిరిజనుల కష్టాలను తొలగించాలని ఏకంగా బ్రిటీష్ వారిపైనే సమరానికి…
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 4న విశాఖ రానున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు జూలై 4న భీమవరం వస్తున్న నరేంద్ర మోదీ అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరల మీద అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. ఆయన విశాఖ మన్యం బెబ్బులిగా మారి నాటి బ్రిటిష్ దొరల మీద భయంకరమైన యుద్ధం…