ఆదివారం కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. మిత్రపక్షాల మద్దతుతో మోడీ.. సర్కార్‌ను నెలకొల్పారు. ఎవరికి దక్కాల్సిన పదవులను వారికి పంచేశారు. అయితే ఇదంతా ఒకెత్తు అయితే.. అసలు సిసలైన మరో పోస్టు.. ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకంగా మారింది.
మోడీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ పవర్ హౌస్‌గా మారిపోయిందన్నారు చంద్రబాబు నాయుడు. నా రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలను చూశాను.. కానీ, నరేంద్ర మోడీ లాంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడలేదన్నారు.. మేకిన్ ఇండియా, విజినరీతో మోడీ.. దేశానికి అద్భుత విజయాలు అందించారని ప్రశంసలు కురిపించారు..