Chandrababu: మోడీపై బాబు ప్రశంసలు.. ఆయన లాంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: పార్లమెంట్ భవనంలో జరిగిన ఎన్డీఏ కూటమి నేతలు, బీజేపీ, ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశంలో.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎన్డీఏ కూటమి, బీజేపీ ఎంపీల సమావేశంలో టీడీపీ, జేడీఎస్, ఎన్‌సీపీ, జనసేన, అప్నాదళ్ ఎంపీలు, నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మోడీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ పవర్ హౌస్‌గా మారిపోయిందన్నారు. నా రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలను చూశాను.. కానీ, నరేంద్ర మోడీ లాంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడలేదన్నారు.. మేకిన్ ఇండియా, విజినరీతో మోడీ.. దేశానికి అద్భుత విజయాలు అందించారని ప్రశంసలు కురిపించారు.. అంతర్జాతీయ స్థాయిలోనూ మోడీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు.. మోడీ విజన్, సమర్థత దేశానికి ఎంతో అవసరం.. మోడీ సేవలు దేశానికి చాలా అవవసరం అన్నారు. భారత్‌కు సరైన సమయంలో సరైన నాయకుడు దొరకాడంటూ మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకోవాలని సూచించారు. మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే ఐదో ఆర్థికశాఖగా ఎదిగింది.. ఈ ఐదేళ్లలో ప్రపంచంలోనే రెండో లేదా మూడో ఆర్థిక శక్తిగా మారబోతోందనే నమ్మకాన్ని వెలిబుచ్చారు చంద్రబాబు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసులో బెయిల్ మంజూరు
Also Read
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
దేశంలో ఉన్న యువశక్తి ఐటీ రంగంలో దూసుకుపోతోందన్నారు చంద్రబాబు.. ఇక, ఎన్డీఏతో ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు.. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ప్రజలకు ఎంతో సేవ చేశారు.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎంతో విజన్‌తో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా మేం నరేంద్ర మోడీని ప్రతిపాదిస్తున్నాం అని ప్రకటించారు. మరోవైపు.. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 95 శాతం సీట్లు గెలిచామని వెల్లడించారు.. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా పనిచేసి ఈ విజయం సాధించాయన్నారు.. నా జీవితంలో ఇలాంటి ఫలితాలను చూడలేదని పేర్కొన్నారు.. ఎన్నికల్లో విజయం వెనుక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్ర అమోగం అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి అంతా పనిచేశామని పేర్కొన్నారు. ఇక, ఎన్డీఏ కూటమి సమావేశంలో చంద్రబాబు నాయుడు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!