Plane Crash: 1976లో మలేషియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఆ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల మరణానికి కారణం అయింది. ఆస్ట్రేలియాలో తయారీ అయిన టర్నోప్రోప్ విమానం కుప్పకూలిన ఘటన ఇప్పటికీ మిస్టరీగా మారింది. అయితే దాదాపుగా 47 ఏళ్ల తరువాత ఈ విమాన ప్రమాదానికి కారణం తెలిసింది. అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు కానీ, అగ్నిప్రమాదం, పేలుడకు సంబంధించిన ఎవిడెన్స్ ఏమీ కనిపించలేదు.
Viral Video: జార్ఖండ్ లో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజన్ ఆగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆన్ బోర్డ్ కెమెరా ఫ్లైట్ ప్రమాద దృశ్యాలను చిత్రీకరించింది. చివరకు ఓ ఇంటిలోకి గ్లైడర్ దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో పైలెట్, ప్యాసింజర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
అమెరికాలో పశ్చిమ రాష్ట్రమైన నెవాడాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మెడికల్ ట్రాన్స్పోర్ట్ విమానం కుప్పకూలడంతో అందులో రోగితో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యతి ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా.. ఓ విమానం అదుపుతప్పి నదిలోయలోకి దూసుకెళ్లింది.
Plane Crash : టాంజానియా దేశానికి చెందిన విమానం సరస్సులో కూలిపోయింది.ల్యాండ్ కావడానికి ప్రయత్నించి 43 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది.
గ్రీస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర గ్రీస్‌లో ఒక కార్గో విమానం కూలిపోయింది. సెర్బియా నుంచి భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని మోసుకెళ్తున్న ఆంటోనోవ్-12 కార్గో విమానం ఉత్తర గ్రీస్‌లోని రెండు గ్రామాల మధ్య కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఉక్రెయిన్ దేశానికి చెందిన 8 మంది విమానయాన సిబ్బంది మృత్యువాతపడ్డారు.
చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. చైనా ఈస్టర్న్ కంపెనీకి చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 133మంది మరణించారు. ప్రమాదం ధాటికి విమానం పూర్తిగా దగ్ధమైంది. కన్ మింగ్ నుంచి వెళ్తుండగా గ్వాంగ్జీ ప్రాంతంలోని వుజౌ నగరానికి సమీపంలో విమానం క్రాష్ ల్యాండ్ అయి ప్రమాదం జరిగింది. పర్వతాలలో మంటలు చెలరేగాయని సీసీటీవీ ఫుటేజ్ తెలిపింది. ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్‌లను ఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా…
వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం ఫిలిప్పీన్స్‌లో కుప్పకూలింది.. ప్రమాదం జరిగిన సమయంలో 92 మంది సిబ్బంది విమానంలో ఉన్నారని చెబుతున్నారు.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 40 మంది రక్షించామని.. 17 మంది జవాన్లు మృతిచెందినట్టు గర్తించామని చెబుతున్నారు డిఫెన్స్ సెక్రటరీ.. దక్షిణ కగయాన్ డీ ఓరో నగరం నుంచి 92 మంది జవాన్లు, సిబ్బందితో వెళ్లిన విమానం.. సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్ అయ్యే సమయంలో కూలిపోయింది.. ఆ తర్వాత మంటలు చెలరేగాయి..…