Plane Crash: మద్యం సేవిస్తూ వాహనాలు నడుపరాదు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసుల నినాదం. మద్యం సేవిస్తూ వాహనాలను నడిపితే జరిమానా విధించడంతోపాటు కేసులు సైతం నమోదు చేస్తారు. మద్యం సేవిస్తూ ఏ వాహనం కూడా నడపొద్దు. ఎందుకంటే మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతాయి.. ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తాయి. ప్రమాదాల్లో వారు మరణించడంతోపాటు.. ఎదుటి వారు కూడామరణిస్తున్న సంఘటనలు ఉంటున్నాయి. అయితే ఇపుడెందుకు మద్యం సేవించి వాహనం నడపడంపై మాట్లాడుతున్నామంటే.. ఒకతను బీరు తాగుతూ తన 11 ఏళ్ల కొడుకు చేతికి విమానం నడిపే బాధ్యతను అప్పగించాడు. 11 ఏళ్ల బాలుడికి విమానం నడిపించడానికి అనుమతి ఇవ్వడమే తప్పయితే.. అతను తాపీగా బీరు తాగుతూ కొడుకుకి విమానం ఎలా నడపాలో చెబుతున్నాడు. బీరు తాగుతూ తాను చెప్పిన విషయాలను పూర్తిగా అర్థం చేసుకోలేని బాలుడు విమానం నడపడంలో తడబడ్డాడు.. ఫలితంగా ఇద్దరు అనంత లోకాలకు వెళ్లారు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. బీరు తాగుతూ కొడుకుకు విమానం నడపడం గురించి వ్యక్తి చెబుతున్నప్పటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
Read also: Aditi Shankar: ఏంటి శంకర్ సర్.. కూతురుకు అలాంటి కండీషన్ పెడితే ఎలా.. ?
11 ఏళ్ల తన కుమారుడు విమానం నడుపుతుండగా.. పక్కనే కూర్చున్న తండ్రి మద్యం తాగుతూ విమానం ఎలా నడపాలో అతడికి సూచిస్తున్నాడు. జులై 29న బ్రెజిల్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక బ్రెజిల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్రెజిల్‌కు చెందిన గారన్ మైయాకు 11 ఏళ్ల ఫ్రాన్సిస్కో మైయా కొడుకు ఉన్నాడు. క్యాంపో గ్రాండేలో ఉండే తల్లి వద్ద అతడిని దింపేందుకు రొండోనియాలోని నోవా కాంక్విస్టా నుంచి ఒక ప్రైవేటు విమానంలో బయలుదేరారు. మధ్యలో విల్హేనా ఎయిర్‌పోర్టులో ఇంధనం నింపుకుని తిరిగి ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలో తండ్రి మద్యం(బీరు) తాగుతూ.. కుమారుడికి విమానం ఎలా నడపాలో నేర్పిస్తున్నాడు. ఇలా నడుపుతున్న క్రమంలో విమానం ప్రమాదానికి గురై తండ్రీకుమారుడు ఇద్దరు మృతి చెందారు. తండ్రి నిర్లక్ష్యంగా వ్యవహరించి 11 ఏళ్ల బాలుడితో విమానం నడిపించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని విమాన రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదం జరగడానికి ముందు విమానం ఎవరు నడిపారో తెలియాల్సి ఉందని.. కేసు నమోదు చేసిన పోలీసులు చెబుతున్నారు. భర్త, కుమారుడి మరణ వార్త విన్న అనా ప్రిడోనిక్ తీవ్ర మనోవేదనకు గురైనట్టు అధికారులు తెలిపారు. తన భర్త, కుమారుడి అంత్యక్రియల అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు అధికారులు ప్రకటించారు.
Avião bimotor Beechcraft Baron 58, de matrícula PR-IDE, "caiu matando pai e filho" a Aeronave cair em uma região de mata fechada, na divisa de Rondônia e Mato Grosso. Os destroços da aeronave foram localizados na manhã deste domingo (30) o pecuarista Garon Maia e o filho.🇧🇷 pic.twitter.com/nOEBpVZJup
— D' AVIATION 🇧🇷 (@pgomes7973) August 1, 2023