Brazil: ఫ్లైట్ నడిపిన 11 ఏళ్ల బాలుడు.. మందుకొట్టిన తండ్రి.. ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రెజిల్‌లో ఓ విమానం కుప్పకూలిన ఘటనలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు 11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడుపుతుండగా పక్కనే తండ్రి సీట్లో బీర్ తాగుతున్నట్లు కనిపిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం కూలిపోయే ముందే ఆ వ్యక్తి విమానాన్ని తన కొడుకుకు ఇచ్చాడా లేక.. ఏం జరిగింది అనే విషయాన్ని తేల్చేందుకు అధికారులు విచారణ చేస్తున్నారు.
Read Also: SSMB 29: ఒక్క అప్డేట్ ఇచ్చి చూడు జక్కన్న… బ్రహ్మాండం బద్దలవుతుంది
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అయితే, జులై 29న గారాన్ మాయా అనే పరిశోధకుడు తన 11 ఏళ్ల కొడుకుతో ఫ్రాసిస్కో మాయాతో కలిసి ట్విన్ ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ బేరాన్ 58 ఫ్లైట్ లో బయలుదేరి వెళ్లాడు. ఆ తరువాత కొద్ది సేపటికే విమానం అడవిలో కూలిపోయినట్లు సమాచారం వచ్చింది ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. అయితే, ఆ తండ్రీకొడుకులు రాండోనియా నగరం నుంచి బయలుదేరి.. మధ్యలో విల్హేనా ఎయిర్‌పోర్టులో ఇంధనం నింపుకునేందుకు దిగారు.. ఆ తరువాత బాలుడిని క్యాంపో గ్రాండేలోని అతడి తల్లి దగ్గర దిపేందుకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Read Also: Fire Robot: మంటలను ఆర్పేందుకు సూపర్ ఫైర్ రోబో..
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో గారాన్ తన కుమారుడికి ఫ్లైట్ ఎలా నడపాలో చెప్తున్నట్లు క్లీయర్ గా కనిపిస్తుంది. నిబంధనల ప్రకారం, కనీసం హైస్కూల్ చదువు పూర్తి చేసి 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే విమానాలు నడిపేందుకు అర్హులు.. ఆ వ్యక్తికి తన కుమారుడి భద్రతపై ఎంత శ్రద్ధ ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోందని అధికారులు కామెంట్స్ చేశారు. మరోవైపు, భర్త పిల్లలను కోల్పోయి.. దుఃఖాన్ని తట్టుకోలేకపోయిన గారాన్ భార్య, వారి అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటలకే సూసైడ్ చేసుకుంది.
Avião bimotor Beechcraft Baron 58, de matrícula PR-IDE, "caiu matando pai e filho" a Aeronave cair em uma região de mata fechada, na divisa de Rondônia e Mato Grosso. Os destroços da aeronave foram localizados na manhã deste domingo (30) o pecuarista Garon Maia e o filho.🇧🇷 pic.twitter.com/nOEBpVZJup
— D' AVIATION 🇧🇷 (@pgomes7973) August 1, 2023
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!