Nadendla Manohar : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ నేతగా ఎదగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పవన్ ఒకేలా ఉన్నారన్నారు. పవన్ కల్యాన్ ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా అందరికన్నా ముందుగా స్పందించారని.. ఇక ముందు కూడా అలాగే ఉంటారంటూ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఎన్నో అవమానాలు పడి పార్టీని ఈ స్థాయికి తెచ్చారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే…
జనసేన పార్టీ 11ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏట అడుగు పెట్టింది. నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా నేడు కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. జనసేన 12 ఏళ్ల పండుగ వైభవంగా సాగుతోంది.. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేస్తారు. సభలో 90 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు..
Janasena : పిఠాపురంలో ఈ రోజు జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభ పైనే అదరి దృష్టి ఉంది. పిఠాపురంలో జరుగుతున్న సభకు వెళ్లడానికి అన్ని దారుల్లో జనసైనికులు బయలు దేరుతున్నారు. అయితే సభ దగ్గర మాత్రం మూడు దారులు పెట్టారు. ఈ మూడు దారుల నుంచే సభకు చేరుకోవాలి. ఒక్కో దారిలో ఒక్కొక్కరికి పర్మిషన్ ఇచ్చారు. ఇందులో చూసుకుంటే రాజావారి ద్వారం నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా, వీర మహిళలకు మాత్రమే వెళ్లాలి. వీరు ఇక్కడ…
జనసేన 12వ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో పండగ వాతావరణంలో చేయడానికి ఏర్పాటు చేస్తోంది ఆ పార్టీ.. శాసనసభ్యులు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలంతా ఇవాళ్టి సభను సక్సెస్ చేయడంలో బిజీగా ఉన్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో జయకేతనం సభ గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు..
పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవడానికి జనసేన ఆవిర్భావ సభ ఇక్కడ నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత జరిగే సభ కావడంతో చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం అన్నారు.. రెండు రాష్ట్రాల నుంచి జనసేన ప్రతినిధులు హాజరవుతారు.. జనసేన సిద్ధాంతాలు జనాల్లోకి తీసుకు వెళ్లడం ఈ ఆవిర్భావ సభ ఉద్దేశని వెల్లడించారు..
పిఠాపురం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ.... గత ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుని కూటమి పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు మద్దతు తెలిపారు. ఇక ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి తన సంగతి ఏంటని అడుగుతూనే ఉన్నారాయన. వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రమోట్ చేస్తామని ఎన్నికలకు ముందు స్వయంగా ప్రకటించారు చంద్రబాబు. అటు వర్మకు గౌరవప్రదమైన స్థానం ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కూడా హామీ ఇచ్చేశారు. అయితే రాష్ట్రంలో…
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ట్వీట్ వ్యవహారం వివాదంగా మారింది. ‘కష్టపడి సాధించే విజయానికి గౌరవం’ అంటూ ట్వీట్ చేసిన వర్మ.. కాసేపటికే డిలీట్ చేశారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వర్మ జనసేన జెండాలతో ప్రచారం చేసిన వీడియో షేర్ చేశారు. అయితే ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. కేవలం పవన్ గెలుపు కోసం వర్మ చేసిన ప్రచారం మాత్రమే ఉంది. అయితే వర్మ కాసేపటికి ట్వీట్…
జనసేన ఆవిర్భావ వేడుకలపై అధికారికంగా ఓ ప్రకటన చేసింది జనసేన పార్టీ.. వచ్చే నెల 14న జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు.. ఈ సారి పిఠాపురంలో ఆవిర్భావ వేడుకల నిర్వహణకు జనసేనాని నిర్ణయం తీసుకుంది.. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నాయి జనసేన శ్రేణులు.. ఈ మేరకు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు..
జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజులపాటు ప్లీనరీ జరపాలని నిర్ణయించారు.