కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన మద్దతుతో విడివిడిగా పోటీకి దిగడంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోకస్‌పెట్టారు.. రెండు పార్టీల నియోజకవర్గ నేతలను సమన్వయం చేయాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడుకి బాధ్యతలు అప్పగించారు..
ఇప్పుడు పిఠాపురంలో జరుగుతోన్న ఓ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉండగా.. ఇప్పుడు టీడీపీ-జనసేన మధ్యే ప్రధాన పోటీ జరుగుతుండడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది..
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా వరదకు ఎఫెక్ట్ అయ్యారు. పవన్ ఇంటి స్థలం ఏలేరు వరద ముంపుకు గురైంది. పిఠాపురం వై.జంక్షన్ వద్ద పవన్ కల్యాణ్ ఇంటి స్థలం నీట మునిగింది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న కాకినాడ జిల్లా పిఠాపురంలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు ఏపీ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ.. పిఠాపురంలోని జగనన్న కాలనీ, సూరంపేట వరద బాధితులకు 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
తన నియోజకవర్గంలోని ఆడపడుచుల మనసులు గెలుచుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం.. శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అయిన ఈ రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా.. 12 వేల చీరలను పిఠాపురంలోని ఆడపడుచులకు పంపించారు పవన్ కల్యాణ్..
Bunny Vas Comments on Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని ‘ఆయ్” చిత్ర యూనిట్ దర్శించుకుంది. ఈ క్రమంలో ఆయ్ సినిమా నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర కామెంట్స్ చేశారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ ను నెగ్గించుకుని సినిమా ఇండస్ట్రీకి చాలా ఇచ్చిందని, పిఠాపురానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పిఠాపురంలో ట్రైలర్ లాంచింగ్ నిర్వహించామని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అనేక కార్యక్రమాలు పిఠాపురంలో జరుగుతుంటాయి, అందుకు నేను…
పిఠాపురం నియోజకవర్గంలో.. వైసీపీకి భారీ షాక్ తగలబోతోందట.. వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.. దీనిపై తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారట పెండెం దొరబాబు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. దానిని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచే అమలు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.