కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆరు నెలల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అమ్మ శైలజ, అమ్మమ్మ అన్నవరం కలిసి చిన్నారిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనుమాం వచ్చి శైలజ, అన్నవరంను పోలీసులు విచారించగా.. అసలు విషయం బయట పడింది. తల్లి, కూతుళ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో అన్నవరం నివాసం ఉంటోంది. అన్నవరం కూతురు శైలజ కులాంతర…
నిస్వార్ధంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, సాంత్వన కలిగిస్తుందన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరచిపోరు అని ప్రశంసించారు. నర్సుల కష్టంను తాను స్వయంగా చూశానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో డిప్యూటీ సీఎం…
ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడం అని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు చేస్తే యాక్షన్ తీసుకుంటాం అని పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
పిఠాపురంలో తమ్ముళ్ళ దూకుడుకు బ్రేకులు పడుతున్నాయా? హై ప్రొఫైల్ సెగ్మెంట్‌లో పదే పదే సమస్యలు రావడంపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా ఉందా? పిన్ టు పిన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోసం పెద్దలు ఆదేశించారా? యవ్వారం శృతిమించకుండా ఏం చేయాలనుకుంటోంది పార్టీ అధిష్టానం? ఓవర్ స్పీడ్‌ని కంట్రోల్ చేసే ప్లాన్స్ ఏంటి? ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమి పెద్దల్లో ఒకరి ఓన్ సెగ్మెంట్ అయినా సరే…. ఇక్కడ మాత్రం టీడీపీ, జనసేన…
పార్టీలో లోకేష్కి కీలక బాధ్యతలు ఇవ్వాలంటున్నారు.. టీడీపీకి లోకేష్ నాయకత్వం అవసరం అన్నారు వర్మ.. పార్టీకి 2047 ప్రణాళిక కావాలని అభిప్రాయపడ్డారు.. అయితే, పార్టీ రథసారథిగా నారా లోకేష్ ను నియమించేలా.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాదు. లోకేష్ నిర్వహించిన యువ గళం పాదయాత్ర వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు వర్మ..
MLC Nagababu: జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు నాగబాబు ఈ రోజు (ఏప్రిల్ 5న) పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో తెలుగు దేశం, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.
పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి రూ. 59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పవన్ కల్యాణ్..
Pawan Kalyan : పిఠాపురంలో జనసేన ఆవిర్భావ 12వ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా హిందీ భాష, సనాతన ధర్మం, ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడగొట్టడంపై మాట్లాడారు. భారత్ దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడగొట్టొద్దు అంటూ తేల్చి చెప్పారు. మనమంతా ఇండియన్లుగా గర్వించాలన్నారు. ఎప్పటికీ ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడిపోతాం అని ఎవరికి వారు మాట్లాడితే ఎలా..…
Pawan Kalyan : పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అట్టహాసంగా సాగుతోంది. ఈ సభలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారు. తాను ఒక్కడిగా 2014లో జనసేన ప్రయాణం మొదలు పెట్టానని.. ఈ రోజు ఈ స్థాయి దాకా వచ్చామంటూ చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగం ముందు తమిళంలో ఒక పద్యం పాడారు. భయం లేదు కాబట్టే ఎవరికీ భయపడకుండా ఈ స్థాయి దాకా ఎదిగామంటూ దాని అర్థం…