పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు వర్మ – వంగా గీత మధ్య యూరియా సరఫరా సమస్యపై మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు రోజుల క్రితం పిఠాపురంలోని పొలాల్లో రైతుల వద్దకు వెళ్లి యూరియా సమృద్ధిగా దొరుకుతుందా అని పరిశీలించిన వర్మ, వైసీపీ ఎమ్మెల్యేలను “కళ్ళు ఉన్న కబోదులు” అని విమర్శించారు. వర్మ మాట్లాడుఊ.. “అసెంబ్లీలో వచ్చి మాట్లాడండి. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదు. ప్రభుత్వం పారదర్శకంగా యూరియా సరఫరా చేస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న 11 నియోజకవర్గాలలో…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు భద్రత కల్పించింది ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యేకు (1+1) గన్మెన్లను కేటాయించింది ప్రభుత్వం.. తనకు భద్రత కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వర్మ.. దీంతో, ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది.
పిఠాపురం ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రావణ శుక్రవారం కానుక సిద్ధం చేస్తున్నారు.. శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.. 10 వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేయబోతున్నారు పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. అనాధ విద్యార్థినీ విద్యార్థులకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సహాయం అందించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ తనకు అందుతున్న జీతభత్యాల నుంచి పిఠాపురంలో అనాధ విద్యార్థిని విద్యార్థులకు ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఈ నెల కూడా చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం అందచేయడానికి ఏర్పాట్లు చేయవలసిందిగా కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 42 మందికి అయిదువేల రూపాయల చొప్పున చెక్కులను అందజేయనున్నారు. ఈ చెక్కులను జనసేన…
పవన్ ఏదో చేస్తారని పిఠాపురం ప్రజలు ఆశపడ్డారు.. కానీ, ఏడాది గడిచినా పిఠాపురంలో అభివృద్ధి సున్నా అని ఎద్దేవా చేశారు. పవన్ సీఎం అవుతానని చెప్పి.. మరొకరిని ముఖ్యమంత్రిని చేశారని తెలిపారు. ఇక, రాజకీయంగా జన్మనిచ్చిన పిఠాపురంలో పవన్ అంతం అయ్యేలా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని జక్కంపూడి రాజా కోరారు.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో యాక్టివ్గా ఉండడానికి వైసీపీ నేతలు అస్సలు ఇష్టపడడం లేదట. 2024 ఎన్నికల ముందు ఇంకేముంది.... అధికారం మనదే....., మన నాయకురాలు డిప్యూటీ సీఎం అయిపోతున్నారంటూ నానా హంగామా చేసిన నాయకులు ఇప్పుడసలు పత్తా లేకుండా పోయారట. డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ నాడు రచ్చ చేసిన వాళ్ళలో ఒక్కరి మాట కూడా నేడు నియోజకవర్గంలో వినిపించడం లేదని అంటున్నారు.
సొంత ఇంట్లో అద్దెకున్నట్టు ఫీలవుతున్నారట పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఎన్నికల తర్వాత కొద్ది రోజులు జనసేనకు, వర్మకు వ్యవహారం బాగానే నడిచింది. కానీ... నెమ్మదిగా గ్యాప్ పెరిగింది. చివరికి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే... కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఇష్టపడడం లేదు రెండు వర్గాలు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత జనసేన కండువాలు…
Janasena: పిఠాపురం మండలంలోని పక్రుద్దీన్ పాలెం పాపిడి దొడ్డి చెరువు వద్ద మట్టి తవ్వకాలు ముదిరి జనసేన పార్టీలోని నేతకు రెండు వర్గాలుగా చీలిపోయి వీధికెక్కే స్థాయికి వెళ్లింది. విరవ గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి కురుమళ్ళ రాంబాబుపై, విరవాడకు చెందిన పలువురు జనసేన నాయకులు దాడి చేశారంటూ పిఠాపురం రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ వివాదం వాస్తవానికి ఇటుక బట్టీలకు మట్టి తరలింపు విషయంలో ప్రారంభమైంది. చెరువులో మట్టి తవ్వకాలకు అవసరమైన అధికార అనుమతుల…
SVSN Varma : పిఠాపురంలో ఇసుక మాఫియాపై ఎస్వీఎస్ ఎన్ వర్మ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పిఠాపురంలో గత ఐదేళ్లలో ఉన్న ఇసుక మాఫియానే మార్పులు, చేర్పుల పేరుతో ఇప్పుడు కూటమి పార్టీల్లోకి వచ్చి అదే దందాను కొనసాగిస్తోందన్నారు. వాళ్లు ఇలా చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వర్మ విమర్శించారు. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే.. రైతు తట్టెడు మట్టి తవ్వుకుంటే నాలుగు రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాడు. కానీ…