Kerala: కేరళలో వెటర్నరీ విద్యార్థి మరణం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వయనాడ్‌లోని వెటర్నరీ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న జేఎస్ సిద్ధార్థ్ ఫిబ్రవరి 18న కాలేజీ హాస్టల్‌లో ఉరేసుకుని మరణించాడు. అయితే, ఇది ఆత్మహత్య కాదని హత్య అని బాధితుడి కుటుంబం ఆరోపిస్తుంది. ఈ కేసులో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ని శనివారం సస్పెండ్ చేశారు. ఈ కేసులో పోలసీులు 11 మందిని అరెస్ట్ చేశారు. సిద్ధార్థ్ మరణించడానికి ముందు ర్యాగింగ్ చేసి…
సార్వత్రిక ఎన్నికల ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవల ఒడిషా ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు రూ.9 వేల స్కాలర్‌షిప్ ప్రకటించింది.
కేరళ రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు సరైనవి కాదని, వీటి అమలు కష్టమని సీఎం పినరయి విజయన్ తెలిపారు.
కేరళ ఆర్థిక సంక్షోభానికి కారణం మీరంటే మీరేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే కారణమని.. ప్రభుత్వం వృథా ఖర్చులు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి కేంద్ర విధానాలే కారణమని కేరళ ప్రభుత్వం ఆరోపిస్తుంది.
మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన ప్రకటనపై కేరళలో రాజకీయ వివాదం నెలకొంది. కర్ణాటకలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేరళలో అధికార ఎల్‌డీఎఫ్ మిత్రపక్షమైన జేడీఎస్‌కు ఆమోదం తెలిపినట్లు జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ చేసిన వాదనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం (అక్టోబర్ 20) తోసిపుచ్చారు.
కేరళలోని సహకార బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాలపై పినరయి విజయన్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్ ఆంటోనీ బుధవారం విమర్శలు గుప్పించారు. తీవ్రమైన బ్యాంకింగ్ అక్రమాలు, కుంభకోణాల కారణంగా సామాన్యుల జీవితాల పొదుపు ప్రమాదంలో పడుతుందని ఆంటోనీ అన్నారు.
కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. అదే జిల్లాలో మరో ఇద్దరికి కూడా ఈ వైరస్ సోకినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు దేశానికి సానుకూల భవిష్యత్తును తెలియజేస్తున్నాయని, ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.
పర్యాటకుల బృందంతో వెళ్తున్న పడవ మునిగిపోవడం వల్ల 21 మంది మరణించారు. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని మలప్పురం జిల్లా తానూర్ ప్రాంతంలోని తువల్తిరం బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం 30 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న హౌస్‌బోట్ బోల్తా పడి మునిగిపోవడంతో మహిళలు, పిల్లలతో సహా కనీసం 21 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ తదితర పరిశ్రమలో ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖ నటులు కన్నుమూశారు. తాజాగా ప్రముఖ మలయాళ సినీ నటుడు, లోక్‌సభ మాజీ ఎంపీ ఇన్నోసెంట్ మరణించారు.