మనకు మామూలుగా పెయింటింగ్ అంటే ముందుగా గుర్తుకువచ్చేది పికాసో. ఎందుకంటే పెయింటింగ్స్‌లో ఆయన అంత ప్రావీణ్యం కలవాడు కాబట్టి. అయితే పందుల్లో కూడా పెయింటింగ్స్‌లో ప్రావీణ్యం కలిగిన ఓ పంది ఉంది. దానిపేరే పిగ్‌కాసో. సౌతాఫ్రికాలో ఉంటున్న ఈ పందిని చిన్నప్పుడే తన యజమాని ఓ మటన్ షాపుకు అమ్మేశాడు. అయితే ఆ మటన్‌షాపు యజమాని దీనిని వధించి వంటకు వాడాలనుకున్నాడు. కానీ.. అంతలోనే సౌతాఫ్రికాలోని పశ్చిమ కేఫ్ ప్రాంతానికి చెందిన జువానే లెఫ్‌సన్ అనే మహిళ…