Phone Tapping Row: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు కేంద్రమంత్రి సవాల్ విసిరారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీట్ విచారణ పేరుతో తమను వేధిస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తరచూ పోలీస్ స్టేషన్ కు పిలిచి వేధిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు ప్రభాకర్ రావుకు ఇచ్చిన రిలీఫ్‌ను కొట్టివేయాలని పోలీసులు కోరారు. ప్రభాకర్ రావు పిటిషన్ ఆగస్టు 4వ తేదీన విచారణకు రానుంది.
ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈ కేసులో కీలక సూత్రధారి ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేస్తున్నాడు.. ఈనెల 5వ తేదీలోగా హైదరాబాద్‌కు వస్తున్నట్లు పేర్కొన్నాడు..హైదరాబాద్‌కు చేరుకున్న మూడు రోజులు తర్వాత విచారణ అధికారుల ఎదుట హాజర అవుతారని చెప్పారు.. సంబంధించి ప్రాసెస్ ప్రారంభమైనట్లు అనుచర వర్గాలు చెప్తున్నాయి.. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది..