ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి హోమ్ ప్రిన్సిపాల్ సెక్రటరీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ను సిట్ ప్రశ్నించింది. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ గా ఐపీఎస్ అనిల్ కుమార్, హోమ్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఐపీఎస్ జితేంద్ర పని చేశారు. జితేందర్, అనిల్ కుమార్ దగ్గర నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది.
రేపు సిట్ అధికారుల ముందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరయ్యే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల సమయంలో ఈ ముగ్గురి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 2023 నవంబర్ 15వ తేదీ నుంచి ఈ ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు.
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్ టాపింగ్ కి ప్రభాకర్ రావు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. సాధారణ ఎన్నికల సమయంలో 600 మంది మావోయిస్టులకు సహాయం చేస్తున్నారని చెప్పి 600 ఫోన్ లను రివ్యూ కమిటీకి ఇచ్చి టాపిక్కు పాల్పడ్డారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాధారణ ఎన్నికల సమయంలోని నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ కి పాల్పడినట్లు తేలింది. నవంబర్ 15వ తేదీన 600 మంది ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లే గుర్తించారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిపై కేసు నమోదు కాగా సిట్ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ట్యాప్ చేసిన నెంబర్లలో తన నెంబర్ ఉండడంతో కొంత సమాచారం కావాలని సిట్ కోరడంతో సిట్ కార్యాలయానికి వెళ్లారు. సిట్ కు తన స్టేట్ మెంట్ ను ఇచ్చాడు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డితో పాటు నా ఫోన్…
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఇటీవల విచారించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. నేడు మరోసారి సిట్ విచారణకు హాజరుకానున్నారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉదయం 11 గంటలకు మొదటి సాక్షిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్ మెంట్ రికార్డ్ చేయనున్నది సిట్. పీసీసీ చీఫ్…
Phone Tapping Case: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నేతలే టార్గెట్ గా పని చేసినట్లు తెలుస్తుంది.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. ప్రభాకర్ రావును 9 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. జూన్ 14న మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు. నేడు సుదీర్ఘంగా ప్రభాకర్ రావుని సిట్ ప్రశ్నించింది. చాలా ప్రశ్నలకు ఎస్ఐబీ మాజీ చీఫ్ సమాధానాలను దాటవేశారు. కొన్ని ప్రశ్నలకు అధికారికం, వ్యక్తిగతం అంటూ సమాధానాలు ఇచ్చారు. ఇంకొన్ని వాటికి అయితే తెలీదు, గుర్తులేదు అంటూ…
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగింది. సిట్ అధికారులు ఆయనను దాదాపు 8 గంటల పాటు విచారించారు. ప్రభాకర్ రావుపై డీసీపీ విజయ్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేటి విచారణ ముగియగా.. జూన్ 11న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు సిట్ అధికారులు సూచించారు. విచారణకి ఎప్పుడు పిలిచినా…
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు మామూలోడు కాదని, భార్యాభర్తల సంభాషణలను కూడా ట్యాప్ చేసిన ఘనుడు ప్రభాకర్ అని పేర్కొన్నారు. తమ లాంటి అనేక మంది కార్యకర్తల ఉసురు ప్రభాకర్ పోసుకున్నాడన్నారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయ్యిందని.. పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారన్నారు. విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన…