Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును వెంటనే సిట్ (SIT) ముందు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటివరకు అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తూ వచ్చినప్పటికీ, తాజాగా ఈ రక్షణను తొలగించి, కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసు విషయంలో ప్రభాకర్ రావు విచారణకు ఏ మాత్రం సహకరించట్లేదని తెలంగాణ ప్రభుత్వం తరపున పదేపదే వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ప్రభాకర్ రావు ఇప్పటివరకు దర్యాప్తునకు సహకరించలేదని నిర్ధారించింది. అందువల్ల, కేసులో మరింత లోతైన విచారణ కోసం, ఆయన్ను కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తూ, తక్షణమే సిట్ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
Akhanda 2: అఖండ 2’కి లాస్ట్ మినిట్ షాక్..శ్రీశైలంలో బోయపాటి, తమన్
ప్రభుత్వ తరపు వాదనల్లో ముఖ్యంగా డేటా ధ్వంసం అంశంపై కోర్టు దృష్టి సారించింది. ప్రభాకర్ రావు ఉపయోగించిన డివైస్‌ల పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసినప్పటికీ, ఐ-క్లౌడ్‌లో గానీ, డివైస్‌లలో గానీ ఎక్కడా ముఖ్యమైన డాటా లభ్యం కాలేదని, అదంతా డిలీట్ అయిందని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, మొత్తం 36 డివైజ్‌లను పూర్తిగా ధ్వంసం (డిస్ట్రాయ్) చేశారనే తీవ్ర ఆరోపణలు కూడా ప్రభుత్వ వర్గాలు కోర్టు ముందుంచాయి.
ప్రభాకర్ రావు తరపు సీనియర్ కౌన్సిల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ, తమ క్లయింట్ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. పై అధికారుల ఆదేశాల ప్రకారమే, కొన్ని రూల్స్‌కు అనుగుణంగా డివైస్‌లను ధ్వంసం చేయాల్సి వచ్చిందని ఆయన కోర్టుకు తెలియజేశారు. ప్రభాకర్ రావు సీనియర్ సిటిజన్ అయినందున, విచారణ సందర్భంగా ఆయన గౌరవాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు సిట్‌ను ఆదేశించింది. ఆయనపై ఎటువంటి శారీరక హింస (physical torture) ప్రయోగించకూడదని, హాని కలిగించకుండా జాగ్రత్తగా విచారణ జరపాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పూర్తిగా ముగించలేదు. విచారణ కొనసాగుతుందని, తదుపరి విచారణ వచ్చే శుక్రవారం రోజున ఉంటుందని తెలిపింది. అప్పటివరకు కేసుకు సంబంధించిన ప్రస్తుత స్టేటస్ రిపోర్ట్‌ను సిట్ , తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
Indigo Crisis: ప్రయాణికులకు ఇండిగో స్పెషల్ ఆఫర్.. రూ.10వేల ట్రావెల్ వోచర్ ప్రకటన