మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. తాను సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు తీర్పును నిలిపివేయాలని పిటిషన్ వేశారు. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. ఈ రోజు మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ మరియు తనని కస్టడీలోకి తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైక్టరేట్(ఈడీ) అభ్యర్థన అనే రెండు పిటిషన్‌లపై తీర్పును ఇవ్వనుంది.
వారణాసి జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ విగ్రహాలను ఆరాధించేందుకు అనుమతి ఇవ్వాలని 2021 ఆగస్టులో రాఖీ సింగ్‌తో పాటు మరో నలుగురు మహిళలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ కు సంబంధించి పిటిషనర్ రాఖీ సింగ్ రాష్ట్రపతికి లేఖ రాశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు, భయపెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరగనుంది. ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ ను రోహిత్ రెడ్డి దాఖలు చేసిన విషయం తెలిసిందే.. పిటిషన్ లో నలుగురుని ప్రతివాదులుగా చేర్చారు.
తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం సృష్టించింది.. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ఆడియో టేపులు, వీడియో ఫుటేజ్ వైరల్‌గా మారిపోయింది.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నోటీసుల్లో గందరగోళం ఏర్పడింది.