ఏపీలోని గుంటూరు కంచికామాక్షి ఏకాంబరేశ్వర స్వామి దేవస్ధానం భూముల వివాదంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. యలవర్తి కుటుంబీకులు రాసిన గిఫ్ట్ డీడ్ తరువాత 11 సేల్ డీడ్ లు చేసినట్టు కోర్టుకు తెలిపారు పిటిషనర్. భూమిలో 2 ఎకరాలు కళ్యాణోత్సవం నిమిత్తం దేవలయానికి రాసిచ్చిన యలవర్తి కుటుంబీకులు. 400 గజాలు కొనుగోలు అంశంపై చేసిన డాక్యుమెంట్లపై వచ్చిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ప్రొహిబిషన్ లిష్టులోంచీ 400 గజాలు తీసేయాలని ఎండోమెంట్ కమీషనర్ కు అర్జీ పెట్టాడు కొనుగోలుదారుడు హర్ష.
Riyan Parag : ఎంఎస్ ధోనిని టచ్ చేసే ప్రసక్తి లేదు..
అర్జీ ఆధారంగా ఎండోమెంట్ కి సంబంధం లేదంటూ రిజిష్టర్ లోంచీ తీసేయాలంటూ 2022 జనవరిలో ఎండోమెంట్ కమీషనర్ ఆదేశాలు జారీచేశారు. కమీషనర్ ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో ఆలయ భక్తుల ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎండోమెంట్ కమీషనర్ ఆదేశాలపై స్టే ఇస్తూ అప్పుడే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. సెక్షన్ 45 ఎండోమెంట్ యాక్టు ప్రకారం ఏదేని ఆస్తి ఎండోమెంట్ నుంచీ తీసేయడానికి ట్రిబ్యునల్ కి మాత్రమే అధికారం ఉందన్నారు పిటిషనర్. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఎండోమెంట్ కమీషనర్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది హైకోర్టు. ఈ విషయంలో ఎండోమెంట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించచ్చని సూచించింది హైకోర్టు.
Read Also: Jewellery Robbery: దొంగల మాస్టర్ ప్లాన్.. ఏకంగా జువెలరీ షాప్‌లోకి సొరంగం.. భారీ దోపిడి..